రెండు నెలల్లో జగన్ ఆ పని చేస్తేనే ముందస్తు ఎన్నికలు సాధ్యం!

కేంద్ర ఎన్నికల కమీషన్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన చేసిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యం లో ఏపీ లో ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న వార్తలపై మరింత జోరుగా ప్రచారం జరుగుతోంది.

 Will Cm Jagan Go To Early Elections , Cm Jagan,  Elections, Ap Elections, Ap New-TeluguStop.com

ఆరు నెలల ముందు జగన్( jagan ) ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు.అంటే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి లో ఎన్నికలు ఉండాలని భావిస్తున్నారు.

Telugu Ap, Ys Jagan, Ysrcp-Politics

కానీ పరిస్థితి చూస్తూ ఉంటే ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఒకటి రెండు నెలల్లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తేనే తప్పితే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఒక వేళ ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేస్తానంటూ ప్రకటించిన కూడా సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలోనే ఎన్నికలు జరిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు నెలల్లోనే జగన్ తన ప్రభుత్వంను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే 2018 లో కేసీఆర్( KCR ) ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో రెండు మూడు నెలల ముందు నుండే హడావుడి చేశాడు.

Telugu Ap, Ys Jagan, Ysrcp-Politics

కానీ ఇప్పుడు ఆ హడావుడి కనిపించడం లేదు.ముందు ముందు జగన్ ఏమైనా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి.ఆకట్టుకునే పథకాలను ముందుగానే ప్రకటించడంతో పాటు అన్ని విధాలుగా ఎన్నికలకు సంసిద్దం అయితేనే జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అంటే కచ్చితంగా సాహసం తో కూడిన విషయం.అందుకే జగన్ ఆ సాహసం ను చేస్తాడా లేదా అనేది చూడాలి.2019 లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెల్సిందే.మరి ముందుగానే ఎన్నికలు జరిగేనా తెలియాలి అంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube