కుంకుమ ‌పువ్వు తీసుకుంటే పిల్ల‌లు తెల్ల‌గా పుడ‌తారా.. ?అస‌లు నిజం ఇది!  

Will children be born white if they take saffron flower? children, white, saffron flower, saffron, latest news, pregnancy women, pregnant, health news, - Telugu Children, Health News, Latest News, Pregnancy Women, Pregnant, Saffron, Saffron Flower, White

కుంకుమ పువ్వు.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

TeluguStop.com - Will Children Be Born White If They Take Saffron Flower

ప్రపంచంలోనే అత్యంత‌ ఖరీదైన సుగంధ ద్రవ్యము ఇది.అతి ఖ‌రీదైన‌దే కాదు.బోలెడ‌న్ని ఔష‌ధ గుణాలు కూడా కుంకుమ పువ్వులో ఉంటాయి.ఈ కుంకుమ పువ్వును ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు వాడుతుంటారు.ఎందుకంటే.కుంకుమ పువ్వు వాడ‌డం వ‌ల్ల పుట్టే పిల్ల‌లు తెల్ల‌గా పుడ‌తార‌ని న‌మ్మ‌కం.

కానీ, వాస్త‌వానికి కుంకుమ పువ్వుకు, పిల్ల‌ల రంగుకు ఎలాంటి స‌బంధం లేదంటున్నారు నిపుణులు.

TeluguStop.com - కుంకుమ ‌పువ్వు తీసుకుంటే పిల్ల‌లు తెల్ల‌గా పుడ‌తారా.. అస‌లు నిజం ఇది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కుంకుమ పువ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ముఖ్యంగా ప్రెగ్నెంట్‌గా ఉన్న స్త్రీలు పాల‌లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల శరీరంలోని రక్తం శుద్ధి జ‌రుగుతుంది.కుంకుమ పువ్వులో ఉండే మాంగనీస్ శరీరానికి ప్రశాంతత చేకూర్చుతుంది.

నిద్ర‌లేమిని దూరం చేసి.మంచిగా నిద్ర ప‌ట్టేలా చేస్తుంది.

కండ‌రాల‌ను రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.మ‌రియు క‌డుపులోని బిడ్డ కు కూడా ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా జ‌రిగేలా చేస్తుంది.
త‌ద్వారా పుట్టబోయే బిడ్డ చ‌ర్మం ఆరోగ్యంగా వృద్ధి చెందుతుంద‌ట‌.అంతేగాని, కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్ల‌లు తెల్ల‌గా పుడ‌తారు అన్న దాంట్లో ఎలాంటి నిజం లేద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

తల్లిదండ్రుల జీన్స్ ఆధారంగానే బిడ్డ క‌ల‌ర్ ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.అయితే కుంకుమ పువ్వు గ‌ర్భిణీల ఆరోగ్యానికి మంద‌ని అంటున్నారు.

అలాగే గ‌ర్భిణీలే కాకుండా.సాధార‌ణ వ్య‌క్తులు కూడా కుంకుమ పువ్వును తీసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

కుంకుమ పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల.ఇందులో ఉండే క్రోసెటిన్ రక్తంలో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను క‌రిగించి.

గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తుంది.కుంకుమ పువ్వులో పుష్క‌లంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌రుస్తుంది.

ఇక పాలలో కుంకుమ పువ్వు క‌లిపి తీసుకుంటే.ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

మ‌రియు ర‌క్త‌పోటు కూడా అదుపులో ఉంటుంది.

#White #Saffron Flower #Children #Pregnancy Women #Saffron

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Will Children Be Born White If They Take Saffron Flower Related Telugu News,Photos/Pics,Images..