వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పాత మిత్రులు అండగా నిలబడతారా?

ఎన్నికలు అంటే సంగ్రామం లాంటివి.యుద్ధంలో ఒక్కరే నిలబడితే గెలవలేం.అందుకే సహచరులు అండగా ఉండి తీరాల్పిందే.2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బీజేపీ రాజకీయంగా.సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లు ఆర్థికంగా అండగా నిలిచారు కాబట్టే చంద్రబాబు ఆ యుద్ధంలో గెలవగలిగారు.2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోరాడారు.రాజకీయంగా, ఆర్ధికంగా ఎలాంటి తోడు కనిపించలేదు.అయితే ఓ ముగ్గురు మాత్రం చంద్రబాబుకు సహాయం అందించారు.

 Will Chandrababu S Old Friends Stand By Him In The Next Election , Andhra Prades-TeluguStop.com

గతంలోటీడీపీ తరఫున ఎన్నికల రాజకీయం నడిపించడంలో ఈ త్రయం కీలక పాత్ర పోషించింది.ముఖ్యంగా టికెట్ల ఎంపిక, ఆశావహుల బుజ్జగింపులు, డబ్బుల పంపిణీ వంటి అంశాలను ఈ త్రయమే చూసుకుంది.

వీరిలో మాజీ ఎంపీ, మాజీ నిఘాదిపతి, పత్రికాధిపతి ఉన్నారు.ప్రస్తుతం మరోసారి చంద్రబాబుకు వీళ్లు సహాయం చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి.

ఎందుకంటే జగన్ ఎడాపెడా కేసులు పెట్టేస్తుండటంతో వీళ్లు చంద్రబాబుకు అండగా నిలబడే విషయంలోజంకుతున్నారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Cm Jagan, Cm Ramesh, Pawan Kalyan, Telugu De

మాజీ ఎంపీ ఇటీవల హైదరాబాద్, ఢిల్లీకే పరిమితం అవుతున్నారు.మాజీ నిఘాధిపతి వరుస సస్పెన్షన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అలాగని ఇప్పటికిప్పుడు సర్వీస్ వదులుకుని రాజకీయాలు చేసే పరిస్థితిలో లేరు.

పత్రికాధిపతి కాస్త నయంగా కనిపిస్తున్నా ఫోన్ ట్యాపింగ్ భయంతో వెనకడుగు వేస్తున్నారు.అటు చంద్రబాబుకు గతంలో ఆర్ధికంగా అండగా ఉన్న వారు కూడా జగన్ భయంతో మొహం చాటేస్తున్నారు.

ఎన్నికల నాటికి వీళ్లు అందుబాటులోకి వస్తారో లేదో కూడా అంతుచిక్కడం లేదు.

Telugu Andhra Pradesh, Chandrababu, Cm Jagan, Cm Ramesh, Pawan Kalyan, Telugu De

అయితే వీరి అండ కావాలంటే చంద్రబాబుకు ముందుగా కేంద్ర ప్రభుత్వ సహకారం అందాలి.అందుకే ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో తాను కీలకం కాకపోయినా ఎన్డీయే అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు.బీజేపీ అండగా ఉంటే తన మిత్రులందరూ తనకు తోడుగా ధైర్యంగా బరిలో నిలబడతారని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్దితుల్లోనూ బీజేపీ మద్దతు సంపాదించాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube