తెలుగుదేశం పార్టీ ( TDP ) తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది.ఈ పార్టీని ప్రారంభించిన ఎన్టీఆర్ ఆయన ఉన్నన్ని రోజులు పార్టీతో పాటు, కార్యకర్తలని, ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు.
ఎన్టీఆర్ తర్వాత ఈ పార్టీకి బాస్ అయింది చంద్రబాబు.చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే బాస్ గా కొనసాగుతూ, కార్యకర్తలకు అండగా ఉంటూ, పార్టీని కాపాడుకుంటూ వచ్చారు.
అలాంటి చంద్రబాబు ( Chandrababu ) మొదటిసారి అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.దీంతో టిడిపి పార్టీలో అల్లకల్లోలం మొదలైంది.
చంద్రన్న కోసం ర్యాలీలు, రాస్తారోకోలు ఎన్ని చేసినా కానీ ఫలితాలు రాలేదు.

ఆయన రిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇదే తరుణంలో నారా లోకేష్ ( Nara Lokesh ) కూడా అరెస్ట్ అవుతారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి దీక్ష చేస్తున్నారు.
ఈ క్రమంలో టిడిపి పెద్దదిక్కు కోల్పోయింది.మరి ఇప్పుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చేది ఎవరు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైంది.వీరు ఎంట్రీ ఇస్తే రాబోవు ఎన్నికల్లో టిడిపికి ప్లస్ అవుతుందా.? మైనస్ అవుతుందా ఇప్పుడు చూద్దాం.అసలు టిడిపి పార్టీని ప్రారంభించిందే నందమూరి ఫ్యామిలీ.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అనూహ్యంగా పార్టీని స్థాపించి కొన్ని నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది.అలాంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి భువనేశ్వరి( Nara Bhuvaneshwari ), బ్రాహ్మణి ( Bramahani ) తప్పకుండా ఎన్టీఆర్ లాగా చతురతతో ఆలోచించి పార్టీని ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది.

ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడని బ్రాహ్మణి కాగడాల నిరసన సందర్భంగా మీడియా ముందు అదరగొట్టేసింది.ఆమె మాటలు చూసిన టిడిపి కార్యకర్తలకు, నాయకులకు కాస్త బలం చేకూరింది.టిడిపిని కాపాడే సత్తా భువనేశ్వరి, బ్రాహ్మణి ( Brahmini ) లకు ఉందని భావిస్తున్నారు.ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన వీరు రాజకీయంగా ఎంతో పట్టు కలిగిన వారే.
ఎత్తుకు పై ఎత్తు వేయగల శక్తి వారి బ్లడ్ లోనే ఉంది.వారి శక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించి టిడిపిని మరింత బలంగా తయారు చేసే అవకాశం కనబడుతోంది.
రాబోవు ఎన్నికల సమయానికి వీరి ఎంట్రీ కలిసొచ్చే అంశంగా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.