అక్కడ బీజేపీ పోటీ చేయడం వైసీపీకి ప్లస్ అవుతుందా..

ఎన్నికలు.ఉప ఎన్నికలు.మధ్యంతర ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య రాజ్యంలో సహజంగా జరుగుతాయి.ఇది నిరంతర ప్రక్రియ.ఈ ప్రక్రియను చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతి పత్తితో పనిచేస్తుంది.ఎక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా భారీ భద్రతతో ఎన్నికలను నిర్వహిస్తూ ఉంటుంది.

 Will Bjp Contesting There Be A Plus For Ycp In Atmakuru By Elections Details, At-TeluguStop.com

అలానే ప్రస్తుతం ఏపీలోని ఆత్మకూరు నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ ను నిర్ణయించింది.అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

దీంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఎవరైనా ఎక్కడైనా ఏ పార్టీ వారైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించి ఉప ఎన్నిక వచ్చినపుడు అక్కడ మిగతా పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో ఉంచవు.

ఇది రాజ్యాంగంలో లేని ఒక శాసనంలా ఇన్నాళ్లూ ఉండేది.కానీ ప్రస్తుతం రోజులు మారాయి.పార్టీలు అటువంటి సాంప్రదాయాలకు నీళ్లొదిలాయి.ఇప్పుడు ఆత్మకూరు విషయంలో కూడా అదే జరుగుతోంది.

అక్కడ టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థిని నిలబెట్టకూడదని నిర్ణయించుకున్నా కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం తమ అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తోంది.

Telugu Atmakuru, Chandrababu, Gvl Simha Rao, Janasena, Mekapatigoutham-Political

ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా కన్ఫామ్ చేశారు.తమ పార్టీ ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని ప్రకటించారు.దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

బీజేపీ పోటీ చేసినా గెలవదని.వైసీపీ అక్కడ గెలిచి తమకు ప్రజా బలం ఉందని చూపించుకుంటుందని చెబుతున్నారు.

బీజేపీ నిర్ణయం వైసీపీకి ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారు.ఇంతకు ముందు ఉప ఎన్నికలు జరిగిన చోట కూడా బీజేపీ పోటీ చేసింది కానీ అక్కడ గెలవలేదని ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube