సోషల్ మీడియానే ఇక బీజేపీ ప్రధానాస్త్రంగా ఎంచుకోనుందా?

ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఒకే ఒకటి ఏమైనా ఉంది అంటే అది సోషల్ మీడియా.ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు.

 Will Bjp Choose Social Media As Its Mainstay, Bjp, Bandi Sanjay-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియా ఏ స్థితికి చేరుకుందంటే ప్రభుత్వాలను మార్చే ఓ శక్తిగా అవతరించింది.అదే విధంగా మన దేశంలో ఎక్కువగా యువత ఉండటం, వారు ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతుండటంతో రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే ప్రజల్లో బలాన్ని పుంజుకుంటున్న పార్టీలు సోషల్ మీడియాలో ఎంట్రీతో మరింత బలంగా తయారయి తమ ఓటు బ్యాంకును పెంచుకుంటున్నాయి.

ఇక బీజేపీ విషయానికొస్తే తెలంగాణలో సోషల్ మీడియాలో బీజేపీ ఉన్నంత యాక్టివ్ గా ఏ పార్టీలు ఉండటం లేదనేది వాస్తవం.

దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపుకు సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించిందనే విషయం మనకు తెలిసిందే.టీఆర్ఎస్ నేతల విమర్శలను బీజేపీ సోషల్ మీడియా పేజీలో ఎండగడుతూ ఇటు సోషల్ మీడియాలోనూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచుతూ దూసుకుపోతోంది.

తాజాగా కేసీఆర్ చేసిన ఓ వ్యాఖ్యను ఆధారంగా చేసుకొని తమ సోషల్ మీడియా పేజీలలో టీఆర్ఎస్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తూ నాగార్జున సాగర్ గెలుపుకు వ్యూహాలు రచిస్తోంది.ఏది ఏమైనా బీజేపీ పార్టీ బలపడడం కోసం సోషల్ మీడియాను బలమైన అస్త్రం వాడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube