కేసీఆర్ నిర్ణయాల వెనుకంజతో బీజేపీకి లాభమా? నష్టమా?

ఇటీవల కేసీఆర్ తాను తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసుకొని తిరిగి పాత విధానాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అసలు విషయం ఏమిటంటే ఏవైతే కేసీఆర్ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారో వాటిపై పెద్ద ఎత్తున బీజేపీ పోరాటం చేసింది.

 Will Bjp Benefit From The Backlash Of Kcr Decisions Loss Kcr, Bjp, Bandi Sanjay,-TeluguStop.com

కాని బీజేపీ కూడా ఊహించనంతగా కేసీఆర్ తన నిర్ణయాలపై వెనక్కి తగ్గారు.ఈ చర్యల వల్ల బీజేపీకి లాభమా? నష్టమా? అని ఒకసారి మనం విశ్లేషించుకుంటే తమ పోరాటాల వల్లే కేసీఆర్ వెనక్కి తగ్గారని, బీజేపీ అంటే కేసీఆర్ కు వెన్నులో వణుకు పుడుతున్నదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.కాని కేసీఆర్ నిర్ణయాల వెనుకంజతో బీజేపీకి కొంత మేర లాభము, నష్టము రెండు దాగి ఉన్నది.ఉదాహరణకు వ్యవసాయ చట్టాలను కేసీఆర్ సమర్ధించారు.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Amith Shah, Harish Rao, Kavitha, Modi-T

అందులో ఉన్న కిటుకు ఏంటంటే నూతన వ్యవసాయ చట్టంలో కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని నిబంధన ఉంది.కేసీఆర్ వెంటనే తెలంగాణలో కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విమర్శించిన బీజేపీ, ఇప్పుడు కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు రద్దు చేయడానికి నూతన వ్యవసాయ చట్టం అని రైతులు భావిస్తే, రైతులు బీజేపీపై కన్నెర్ర చేసే అవకాశం లేకపోలేదు.కావున కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇంత మతలబు దాగి ఉంది.

కేసీఆర్ ఎందుకు తగ్గుతున్నాడనేది బీజేపీ అవగాహన చేసుకుంటే ప్రజల ఆగ్రహం నుండి తప్పించుకునే అవకాశం ఉంది.లేదు కేసీఆర్ భయపడ్డాడు అనే కోణంలో తీసుకుంటే, తరువాత జరిగే నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది.

ఈ నిర్ణయాలు బీజేపీకి లాభమా, నష్ఠం కాదు ఇది కేసీఆర్ వ్యూహంలో భాగమని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube