వచ్చే ఎన్నికల్లో ఈటెలను బీజేపీ ఎర వేయనున్నదా?

తెలంగాణలో రాజకీయ సమరం అకాశాన్నంటుతోంది.రోజురోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో రాజకీయం రణరంగంగా మారింది.

 Will Bjp Bait The Etela In The Coming Elections-TeluguStop.com

ఈటెల భర్తరఫ్ అనంతరం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఈటెల, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన పరిస్థితి ఉంది.అయితే నేడు మాజీ మంత్రి ఈటెల బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈటెల చేరికతో బీజేపీ మరింత బలపడ్డదని చెప్పవచ్చు.ఎందుకంటే 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగి ఉన్న ఈటెలకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహంపై మంచి అవగాహన ఉంది.

 Will Bjp Bait The Etela In The Coming Elections-వచ్చే ఎన్నికల్లో ఈటెలను బీజేపీ ఎర వేయనున్నదా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈటెలను ఎరగా వేసే అవకాశాలున్నాయి.అంతేకాక ఇప్పటికే  చాలా వరకు పకడ్భందీ వ్యూహాలు  రెడీ చేసిన బీజేపీ టీఆర్ఎస్ ను సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఎదుర్కోవాలనే విషయంపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది.

కెసీఆర్ వైఫల్యా  లను ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా కెసీఆర్ టార్గెట్ గా బీజేపీ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ పాళ్ళు కనిపిస్తోంది.

మరి బీజేపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.అంతేకాక రాజకీయ అపరచానక్యుడైన కెసీఆర్ బీజేపీ వ్యూహాన్ని పసిగట్టలేడా అన్నది ఇప్పుడు రాజాకీయ విశ్లేషకుల అనుమానం.

ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

#Trs Party #Etela Rajender #KCR Politics #TRS Vs BJP #Etela Into Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు