బాలయ్య 100వ సినిమాను చేస్తాడా?

‘సింహా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్‌’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అందరి అంచనాలను అందుకుంటూ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ సాధించిన ‘లెజెండ్‌’ చిత్రం తాజాగా 275 రోజులు పూర్తి చేసుకుంది.

 Will Balakrishna Do 100th Movie?-TeluguStop.com

ఈ సందర్బంగా కడపలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బోయపాటి మాట్లాడుతూ మరో సారి బాలకృష్ణతో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు.

‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణతో బోయపాటి చేయబోయే సినిమాకు అంచనాలు మరింతగా ఉంటాయి.అందుకు తగ్గట్లు బోయపాటి సినిమా చేయాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.

ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించేంది 100వ సినిమాలోనేనా అనే చర్చ ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.ప్రస్తుతం బాలయ్య సత్యదేవ్‌ దర్శకత్వంలో 98వ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ తర్వాత 99వ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.ఆ తర్వాత బాలయ్య 100వ సినిమా భారీ బడ్జెట్‌ మరియు భారీ కాస్టింగ్‌తో తెరకెక్కబోతుంది.

బోయపాటి అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం బోయపాటి శ్రీను ‘అల్లుడు శీను’ ఫేం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube