అనుష్క పెళ్లి ఏమైంది?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ‘బాహుబలి’ తర్వాత పెళ్లి చేసుకోబోతుంది అంటూ రెండు సంవత్సరాల క్రితం మీడియాలో వార్తలు జోరుగా వచ్చాయి.‘బాహుబలి’కి ముందే అనుష్క పెళ్లి ఉంటుందని కూడా కొన్ని సార్లు వార్తలు వచ్చాయి.

 Will Anushka Marry In 2016..?-TeluguStop.com

అయితే ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదలై చాలా నెలలు అయ్యింది, రెండవ పార్ట్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది.ఈమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ‘రుద్రమదేవి’ చిత్రం కూడా విడుదల అయ్యింది.

అయినా ఇప్పటికి కూడా అనుష్క పెళ్లి గురించిన ఆలోచిస్తున్నట్లుగా అనిపించడం లేదు.

‘రుద్రమదేవి’ చిత్రం విడుదల తర్వాత అనుష్క హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు కాస్త బ్రేక్‌ ఇస్తుందేమో అని అంతా అనుకున్నారు.

కాని అనుష్క మాత్రం ఏమాత్రం తగ్గేది లేదు అంటూ ఇప్పటికే రెండు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.మరో వైపు తమిళంలో కూడా ఈమె ఒక భారీ చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యింది.

ఇలా అక్కడ, ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న అనుష్క పెళ్లి ఇప్పట్లో లేదని అనిపిస్తోంది.ఈమె కుటుంబ సభ్యులు పెళ్లి గురించి పోరు చేసి చేసి అలిసి పోయారని, ఇక అనుష్క ఇష్టం వచ్చినప్పుడు వారు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక అనుష్క ఈనెలలో ‘సైజ్‌ జీరో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.‘బాహుబలి’ రెండవ పార్ట్‌ చిత్రీకరణ కోసం అనుష్క సన్నబడే ప్రయత్నంలో ప్రస్తుతం ఉంది.2016లో అయినా అనుష్క పెళ్లి గురించి ఏమైనా మాట్లాడేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube