బన్నీ కోసం ఆ హీరోని పక్కన పెట్టిన రాజ్ తరుణ్ డైరెక్టర్...

టాలీవుడ్ లో స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే తాజాగా అల్లు అర్జున్ నటించిన టువంటి చిత్రం అల వైకుంఠ పురములో.

 Will Allu Arjun Stoped To The Hero Nikhil-TeluguStop.com

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు.అయితే గత నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైనటువంటి అల వైకుంఠపురములో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టింది.

అంతేగాక అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది.

అయితే తాజాగా అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి సంబంధించినటువంటి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

అయితే అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి కుమారి 21ఎఫ్ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి సూర్య ప్రతాప్ ని కథ అందించవలసిందిగా సుకుమార్ కోరాడు.

అయితే సూర్య ప్రతాప్ ప్రస్తుతం హీరో నిఖిల్ తో మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Telugu Allu Arjun, Alluarjun-Movie

అయితే ఈ చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అంతేగాక నిఖిల్ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా కొంత సమయం ఉండటంతో సుకుమార్ సూర్య ప్రతాప్ ని కథ అందించాల్సిందిగా కోరినట్లు సమాచారం.దీంతో పలు వెబ్ సైట్లు (telugustop.com కాదు) ఈ విషయం పై తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయి.

అంతేగాక నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలను రాస్తే పాఠకులు తప్పుదోవ పడతారని చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చినటువంటి ఆర్య చిత్రం మంచి హిట్ అయిందో అందరికీ బాగా తెలుసు.

దీంతో సుకుమార్ మరోసారి బన్నీతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube