బాలయ్యకి నో చెప్పిన మహానటి.... చివరికి  

Will Actress Keerthi Suresh Said No To The Balakrishna Movie - Telugu Keerthi Suresh And Balakrishna News, Keerthi Suresh Latest Movie News, Keerthi Suresh Movie News, Keerthi Suresh News, Tollywood Actress Keerthi Suresh

ప్రస్తుతం నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులు నటిస్తున్నారు.

Will Actress Keerthi Suresh Said No To The Balakrishna Movie

 ఇందులో మొదటి హీరోయిన్ గా నయనతార ఖరారు కాగా మరో కథానాయిక విషయంలో ఇప్పటికీ సందిగ్దత నెలకొంది.అయితే తాజాగా రెండో కథానాయిక విషయానికి సంబంధించి ఓ వార్త నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇందులో రెండవ కథానాయిక విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను మహానటి చిత్రంలో అలనాటి విలక్షణ నటి సావిత్రి పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్ కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు సమాచారం.అయితే కీర్తి సురేష్ మాత్రం తన డేట్లు ఖాళీ లేవంటూ సున్నితంగా తిరస్కరిం చిందట.

దీంతో ఫైనల్ గా  బాలయ్య బాబు చిత్రంలో రెండో కథానాయికగా తెలుగు భామ అంజలిని తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై కూడా చిత్ర యూనిట్ సభ్యులు గాని దర్శకుడు బోయపాటి శ్రీను గాని ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

దీంతో ఇప్పటికీ బాలయ్య బాబు రెండో హీరోయిన్ గురించి సరైన క్లారిటీ లేదు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా అనే చిత్రంలో నటిస్తోంది.అలాగే టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు