వైల్డ్‌ ఫొటోగ్రాఫర్ నెత్తి మీదకు ఎక్కిన ముంగిసలు.. వీడియో వైరల్!

వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్స్‌ అభయారణ్యాలలోకి వెళ్లి వన్యప్రాణుల ఫొటోలు, వీడియోలు చాలా అద్భుతంగా తీసి వాటిని మనందరికీ చూపిస్తారు.అయితే ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు వీరు జంతువులకు, వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలిగించకుండా ఉంటారు.

 Wildlife Photographer Has An Adorable Interaction With A Mob Of Meerkats,wildlif-TeluguStop.com

వీరు అడవిలో ఒక చెట్టు లాగా ముసుగేసుకొని అన్నిటినీ చాలా చక్కగా రికార్డ్ చేసి అడవిలో ఏం జరుగుతుందనేది అందరికీ కళ్లకు కట్టినట్లు తెలియజేస్తారు.

ఒక జీవి జీవనశైలిని వీరు తమ కెమెరాల ద్వారా చాలా గొప్పగా చూపిస్తారు.

వీరి కారణంగానే ఇప్పుడు ఇంటర్నెట్‌లో మనం వైల్డ్ లైఫ్ వీడియోలు చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నాం.అయితే ఈ ఫోటోగ్రాఫర్‌లు ప్రకృతిలో ఎంతగా మమేకమవుతారో తెలిపే ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా నేలపై పడుకొని ఉండటం చూడవచ్చు.అలా పడుకుని అతడు కొన్ని జీవులతో పాటు మీర్‌క్యాట్ లేదా ముంగిసల కదలికలను కూడా తన కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు.

అయితే ఆ ముంగిసలు తనని గమనించకుండా అతను ప్రకృతిలో కలిసిపోయాడు.దాంతో అక్కడ ఒక మనిషి ఉన్నాడనే విషయాన్ని ముంగిసలు పసిగట్టలేకపోయాయి.

ఆ కెమెరామెన్ ఒక బండ రాయి అనుకోని అతనిపై ఎక్కుతూ అటూ ఇటూ తిరిగాయి.ఈ దృశ్యాలను ఆ కెమెరామెన్ తన చేతిలో ఒక కెమెరా ద్వారా తీశాడు.

ఆ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

ఈ అమేజింగ్ వీడియోని @b&s ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.“మీరు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఉన్నప్పుడు, జంతువులను భయపెట్టకుండా వాటి పరిసరాలలో కలిసి పోవడమే మీ లక్ష్యం” అని ఆ వీడియోకి @b&s ట్విట్టర్ పేజీ ఒక క్యాప్షన్ జత చేసింది.ఈ వీడియోకి 70 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube