అమెరికా దావానలం...కరోనా వ్యాప్తికి కారణమయ్యిందా...పరిశోధకుల సంచలన ప్రకటన..!!!

అగ్ర రాజ్యం అమెరికాను వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి.కరోనా థర్డ్ వేరియంట్ డెల్టా ఇప్పటికే అమెరికాలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో అమెరికా పరిశోధకులు సంచలన ప్రకటన చేశారు.

 Wildfire Likely Increased Covid Risk In Neveda State,covid Risk, Neveda State,wi-TeluguStop.com

దరిద్రం నెత్తిమీద ఉంటే నిప్పురవ్వ ఊరు మొత్తాన్ని దహించినట్టుగా అయ్యింది అమెరికా ప్రస్తుత పరిస్థితి.సరిగ్గా ఏడాది క్రితం అమెరికాలోని అడవుల్లో దావానలం ఎగసి పడి లక్షలాది ఎకరాలు బూడిద అయిన విషయం అందరికి తెలిసిందే.

ఈ దావానలం అడవిని మాత్రమే దహించలేదని, కరోనా కరోనా వ్యాప్తి చెందటానికి కారణమయ్యిందని, అమెరికాలోని ఓ ప్రాంతంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవడానికి ప్రధాన కారణం కారుచిచ్చని పరిశోధకులు ప్రకటించారు.


2020 లో అమెరికాలోని నెవాడాలోని రెనో పట్టణంలోని అడవుల్లో మంటలు వ్యాపించి లక్షల ఎకరాల అడవి దహించుకుపోయిందని, ఆ సమయంలో వ్యాపించిన పొగ, ధూళి, కరోనా వైరస్ ప్రభావాన్ని రెట్టింపుగా వ్యాప్తి చెందించిందని తెలిపారు.

రెనో పట్టణంలో అత్యధికంగా కరోనా కేసు నమోదు అవడానికి ప్రధాన కారణం ఇదేనని ప్రకటించారు.రెనో పట్టణాన్ని ఆవరించిన పొగలోని పీఏం 2.5 కరోనా వ్యాప్తికి రెంటు గణాంకాలను విశ్లేషించడం వలన తాము ఈ నిర్ణయానికి వచ్చామని పరిశోధకులు తెలిపారు.ఇదిలాఉంటే


Telugu Burn, America, Calinia, Covid, Neveda, Wildfire, Wildfirecovid-Telugu NRI

అమెరికాలో కొన్నిరోజుల క్రితం 12 రాష్ట్రాలలో 8 లక్షల ఎకరాలకు పైగా కారుచిచ్చులో బూడిద అయ్యిపోయాయి.ఈ మంటలను ఆపడానికి దాదాపు 12 వేల మందికి పైగా ప్రయత్నాలు చేశారు.కాలిఫోర్నియాలో అత్యధికంగా ఈ మంటలు వ్యాప్తి చెందాయని తెలుస్తోంది.

అయితే ఇదే సమయంలో తాజాగా కాలిఫోర్నియాలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా నమోదు అవుతోంది.అయితే రెనో పట్టణంలో ఉత్పన్నమైన పరిస్థితులు కాలిఫోర్నియాలో కూడా రిపీట్ అవుతున్నాయా లేదంటే సహజంగానే కరోనా వ్యాప్తి చెండుతుండా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు ఇదిలాఉంటే ఈ మంటలు వ్యాప్తి చెందిన ఈ 12 రాష్ట్రాలలో భవిష్యత్తులో కరోనా ఏ స్థాయిలో ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube