బుడ్డోడి ధైర్యానికి సలాం...!

నిజంగా ఈ బుడ్డోడు చేసిన పనికి సలాం చెప్పకుండా ఉండలేం.మన అందరికీ తెలిసిన విధంగానే భూమి పైన నివసించే అతి పెద్ద జంతువు ఏది అంటే టక్కున ఏనుగు అని చెప్తాం.

 Son Of Wild Photographer Goes Near Elephant, Elephant, Safari Jungle, Zimbabwe-TeluguStop.com

అయితే చాలా మందికి ఏనుగులను చూస్తేనే భయం వేస్తుంది.అలాంటిది చిన్న పిల్లల సంగతి చెప్పనక్కరలేదు.

అంత పెద్ద జంతువును చూసి భయబ్రాంతులకు లోనవుతారు.


ఇక భారతదేశంలో ఉండే ఏనుగుల కంటే పరిమాణంలో పెద్దగా ఉండే ఏనుగులు ఆఫ్రికా ఖండంలో సఫారీ అడవుల్లో మనకు కనబడతాయి.

అందులోనూ ఆ ఏనుగులు మనుషులను చూస్తే ఎటాక్ చేయడానికి సిద్ధమైపోతాయి.ఆఫ్రికా ఏనుగులను కంట్రోల్ చేయడం ఏమో కానీ, దానికి దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా మంది హడలిపోతారు.

అందుకే ఆ అడవుల్లో నివసించే ఏనుగులను చూడటానికి టూరిస్టులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.వీటితో పాటు అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా ఓ వైల్డ్ ఫోటోగ్రాఫర్ తన కొడుకుని తీసుకుని జింబాబ్వే దేశంలోని సఫారీ అడవుల్లో ప్రయాణం చేస్తూ ఫోటోలను తీసుకుంటుంది.అటుగా వెళ్తున్న ఓ ఆఫ్రికన్ ఏనుగు కు సంబంధించి ఫోటోలు తీస్తుండగా, తనతో పాటు వచ్చిన తన కొడుకు కనురెప్ప మూసి తెరిచే సమయంలో ఆ ఏనుగు దగ్గరికి వెళ్లి దానికి హలో అని చెప్పాడు.

మామూలుగా ఆఫ్రికా అడవులు ఎవరైనా మనుషులు చూస్తే ఇట్టే అటాక్ చేస్తాయి.కానీ ఆ బుడ్డోడి ధైర్యాన్ని చూసి ఆ ఏనుగు కూడా సైలెంట్ గా నిలబడింది.

దీంతో ఆ వైల్డ్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ప్రస్తుతం నెటిజెన్స్ కు తెగ నచ్చేస్తోంది.అంత పెద్ద ఏనుగుకు హలో చెప్పిన బుడ్డోడి ధైర్యానికి ప్రపంచం మెచ్చుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube