నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో సౌత్ నుంచి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న వైల్డ్ డాగ్

కింగ్ నాగార్జున ఈ మధ్య కాలంలో కాస్తా జోనర్ మార్చి తన వయసుకి తగ్గ పాత్రలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.అలాగే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా కథలని పూర్తిగా పక్కన పెట్టి డిఫరెంట్ కంటెంట్ లని ఎంకరేజ్ చేస్తున్నాడు.

 Wild Dog Gets Tremendous Response In Netflix, Tollywood, Digital Entertainment,-TeluguStop.com

అలాగే కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ తనని తాను కొత్తగా రిప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో రీసెంట్ గా వైల్డ్ డాగ్ అనే సినిమాని కింగ్ నాగార్జున చేశారు.

ఈ సినిమా కంటెంట్ మీద నాగార్జునకి గట్టి నమ్మకం ఉండటంతో ప్రమోషన్ కూడా ఎక్కువగానే చేశారు.సినిమా చాలా అద్బుతంగా ఉంటుందని, యాక్షన్ సీక్వెన్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయని, ఈ సినిమాతో ఆహిసోర్ సోలోమన్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

ఇక ఎన్ఎస్జీ కమాండో ఆఫీసర్ గా కింగ్ నాగార్జున ఈ సినిమాలో కనిపించారు.అలాగే అతని టీమ్ లో బాలీవుడ్ బ్యూటీ షయామీఖేర్ కీలక పాత్రలో కనిపించింది.

అయితే సినిమా కంటెంట్ బాగున్నా థియేటర్ లో ప్రేక్షకులని ఈ సినిమా మెప్పించలేకపోయింది.దీంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో భారీ నష్టాలు మిగిల్చింది.థియేటర్ లో వర్క్ అవుట్ అవ్వకపోవడంతో 15 రోజుల్లోనే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు.ఇక డిజిటల్ ప్రేక్షకులని ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటుంది.

అద్బుతమైన సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.థియేటర్ లో ఫ్లాప్ అయిన నెట్ ఫ్లిక్స్ లో మాత్రం రికార్డ్ స్థాయిలో వ్యూస్ తో వైల్డ్ డాగ్ దూసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమాకి వచ్చిన వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.దేశంలోనే టాప్ ట్రెండింగ్ లో ఉన్న మూవీగా వైల్డ్ డాగ్ ఉందని చెప్పింది.

అలాగే సౌత్ లో తక్కువ సమయంలో అత్యధిక వ్యూవర్స్ వీక్షించిన సినిమాగా వైల్డ్ డాగ్ ఉందని స్పష్టం చేసింది.అలాగే మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్ లలో ట్రెండింగ్ లో ఈ మూవీ ఉంది.

ఇక వైల్డ్ డాగ్ డిజిటల్ సక్సెస్ పై కింగ్ నాగార్జున స్పందించారు.ఒటీటీలో తమ సినిమాకి వస్తున్న ఆదరణ చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube