తుక్కురేపుతున్న వైల్డ్ డాగ్.. ఎక్కడో తెలుసా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాను పూర్తి కాప్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సోలోమాన్ తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

 Wild Dog Gets Good Response In Netflix, Wild Dog, Nagarjuna, Netflix, Tollywood-TeluguStop.com

ఇక ఈ సినిమాను ఇటీవల ఓటీటీలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.అయితే ఓటీటీలో రిలీజ్ అయిన వైల్డ్ డాగ్ చిత్రానికి ఊహించని రిజల్ట్ లభించింది.

పూర్తిగా కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన వైల్డ్ డాగ్ చిత్రం హైదరాబాద్‌లో జరిగిన జంట పేళ్లుల్ల నేపథ్యంలో సాగడంతో ఈ సినిమా ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.ఇక ఈ సినిమాలో నేపాల్ సీన్స్ కూడా సినిమాకు బలంగా మారియి.

దీంతో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

అటు తమిళంలో కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండటంతో నెట్‌ఫ్లిక్స్ ఫుల్ ఖుషీలో ఉంది.

ఏదేమైనా థియేటర్లలో ప్రేక్షకులను మోస్తరుగా మెప్పించిన వైల్డ్ డాగ్, ఇలా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సదరు చిత్ర యూనిట్ పండగ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ్ NIA ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను అందించాడు.ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం అలీ రెజా, బాలీవుడ్ భామలు దియా మీర్జా, సయ్యామీ ఖేర్ ఇతరులు కీలక పాత్రల్లో నటించారు.

కాగా ఈ సినిమాను అహిషోర్ సోలోమన్ అదిరిపోయే రీతిలో తెరకెక్కించగా, నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో, తన నెక్ట్స్ చిత్రాలపై నాగ్ ఫోకస్ పెట్టాడు.

మున్ముందు ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube