ఆ విషయంలో తప్పు చేసిన వికీపీడియా.. దాంతో వార్నింగ్ ఇచ్చిన మోడీ సర్కార్..!

తాజాగా భారత దేశ ప్రభుత్వం వికీపీడియాను హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Wikipedia, Central Government, Indian Government, Map, Modi Government, Waring,-TeluguStop.com

భారతదేశంలో ఉన్న అక్సాయి- చిన్ను ప్రాంతాన్ని చైనా భూభాగంలో వికీపీడియా చూపించింది.ఈ విషయంపై తాజాగా భారతదేశ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇందుకు సంబంధించిన మ్యాప్ ను సైట్ నుండి తొలగించాలని భారతదేశ ప్రభుత్వం ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియాను కోరడం జరిగింది.

ఇందుమూలంగా డిజిటల్ సమాచారానికి సంబంధించి ప్రజల ప్రాపత్యను నిరోధించడం సెక్షన్ కింద ఈ లింకును వీలైనంత త్వరగా తొలగించాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ వికీపీడియాను కోరింది.

భారత్- భూటాన్ దేశానికి చెందిన సంబంధం గురించి వికీపీడియా పేజీ లో జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ను తప్పుగా చిత్రీకరించడంతో ఈ అసలు సమస్య మొదలైంది.దీనిపై సత్వర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఓ సోషల్ మీడియా యూజర్ కోరగా దానితో ఈ విషయం బయటకు వచ్చింది.

ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా సదరు మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది.

Telugu Central, Indian, Modi, Wikipedia-Latest News - Telugu

e ఈ పరిస్థితుల్లో భారతదేశం విషయాలకు సంబంధించి దేశ ప్రాదేశిక సమగ్రత, అలాగే సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందుకు మ్యాప్ ను వికీపీడియా నుంచి తొలగించాలని వికీపీడియాకు భారత ప్రభుత్వ ఆదేశాలను పంపించింది.ఇందుకు సంబంధించి త్వరగా వికీపీడియా నిర్ణయం తీసుకోకపోతే అతి త్వరలో వికీపీడియాని భారతదేశంలో నిలిపివేయడానికి భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.ఇదివరకే పాకిస్తాన్ – భారత దేశానికి సంబంధించిన విషయాలలో కూడా ఇదివరకు ఒకసారి పొరపాటు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube