వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్ట్

ప్రపంచంలోని అవినీతిపరులకు ముచ్చెమటలు పట్టించిన ఎంతో మంది రాజకీయ నాయకుల బాగోతాలని బయటపెట్టిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.అసాంజేను అరెస్ట్ చేసేందుకు లండన్ తో ఈక్విడార్ ఎంబాసీ ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం బ్రిటన్ పోలీసులను ఎంబాసీలోకి ఆహ్వానించారు.

 Wikileaks Founder Julian Assange Arrested-TeluguStop.com

ఈ క్రమంలో మెట్రోపాలిటిన్ పోలీస్ అధికారులు అసాంజేను అదుపులోకి తీసుకున్నారు.

అసాంజేని అరెస్ట్ చేయడానికి ఇంగ్లాండ్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది.

ప్రపంచంలో చాలా మంది వ్యాపార ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు అందరి భాగోతాలు అసాంజే బయటపెట్టాడు.ఈ నేపధ్యంలో అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాడనే ఆరోపణలతో తాజాగా అతనిని ఈక్వెడార్ ప్రభుత్వ సాయంతో అరెస్ట్ చేసింది.

అంతర్జాతీయ చట్టంలోని ఆశ్రయ నిబంధనలను వరుసగా అసాంజే ఉల్లంఘించాడంతో ఈక్వెడార్ దౌత్యపరమైన ఆశ్రయాన్ని విత్ డ్రా చేసుకున్నట్టు అధ్యక్షుడు లెనిన్ మొరానో చెప్పారు.అసాంజే అరెస్ట్ మరో సారి ప్రపంచ ద్రుష్టిని తాజాగా ఆకర్షించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube