కర్ణాటక లో 'శుభలగ్నం' సీన్ రిపీట్  

Wife Sells Her Husband To Another Woman For 15 Lakhs-viral In Social Media,viral News Updates,wife Sells Her Husband

నిజంగా కొన్ని కొన్ని చిత్రాలను చూస్తే మాత్రం దర్శకులు ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది.నిజంగా నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా,సినిమా కాబట్టి ఇలాంటి పాయింట్స్ తీసుకొని సినిమా ను తెరకెక్కిస్తున్నారా అన్న అనుమానం కలగక మానదు.

Wife Sells Her Husband To Another Woman For 15 Lakhs-viral In Social Media,viral News Updates,wife Sells Her Husband-Wife Sells Her Husband To Another Woman For 15 Lakhs-Viral In Social Media Viral News Updates

కానీ నిజంగా సినిమా లలో పరిస్థితులు నిజ జీవితంలో కూడా చూడొచ్చు అని అనడానికి ఈ తాజా ఉదంతం ను ఒక ఉదాహరణ గా చెప్పాలి.చాలా సంవత్సరాల క్రితం అంటే 1994 లో టాలీవుడ్ లో వచ్చిన చిత్రం లోని సంఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లా లో చోటుచేసుకుంది.ఏంటి 1994 లో వచ్చిన చిత్రం ఏంటి కర్ణాటక లో చోటుచేసుకున్న సంఘటన ఏంటి అని అయోమయం లో ఉన్నారా.ఆ విషయానికే వస్తున్న ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శక,నిర్మాతగా శుభలగ్నం చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

Wife Sells Her Husband To Another Woman For 15 Lakhs-viral In Social Media,viral News Updates,wife Sells Her Husband-Wife Sells Her Husband To Another Woman For 15 Lakhs-Viral In Social Media Viral News Updates

ఆ చిత్రం టాలీవుడ్ లో ఎంత భారీ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.డబ్బు మీద ఉన్న వ్యామోహం తో కట్టుకున్న భర్త జగపతి బాబు ను హీరోయిన్ రోజా కు మరో హీరోయిన్ ఆమని అమ్మేస్తుంది.

ఆ తరువాత డబ్బు కన్నా భర్త ముఖ్యమని భర్త తోనే విలువ ఉంటుంది అని గుర్తించి చివరికి భార్య భర్తలు కలవడం ఇలా కథ సుకాంతం అవ్వడం తెలిసిందే.అయితే సరిగ్గా అలాంటి భర్తను అమ్మే సీన్ కర్ణాటక లో ఒక మహిళకు ఏర్పడింది.

వివరాల్లోకి వెళ్తే.కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ భర్త కొన్నాళ్లుగా రమ్య అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ క్రమంలో కట్టుకున్న భార్యను వదిలేసిన ఆ భర్త ఎప్పుడూ రమ్య వద్దే ఉంటూ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

దీంతో ఆ భార్య తట్టుకోలేక వారిద్దరి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించింది.ఈ క్రమంలో ఓ రోజు తన భర్త రమ్య ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె.వారిద్దరిని రోడ్డు మీదకు లాగి రచ్చ రచ్చ చేసింది.అయితే, అప్పుడు రమ్య అతడు తన వద్ద డబ్బులు అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు చెల్లించకపోవడం వలనే తన వద్ద ఉంచుకున్నానని బాహాటంగా చెప్పింది.

దీంతో ఆ భార్య కోపం కాస్త నషాళానికి ఎక్కి వెంటనే, ‘నా మొగుణ్ణి పర్మినెంట్‌గా నువ్వే ఉంచేసుకో.కానీ, నా జీవితం బాగుండాలి కాబట్టి, ఎంత ఇస్తావో చెప్పు’ అంటూ ఓ ప్రతిపాదనను తీసుకొచ్చినాట్లు తెలుస్తుంది.

అయితే దానికి రమ్య కూడా స్పందించి నీ భర్త ను పర్మింట్ గా వదిలేస్తే నీకు రూ.5 లక్షలు ఇస్తాను అంటూ డీల్ మాట్లాడింది.దానికి ఆ భార్య కూడా ఒప్పుకోవడం తో వచ్చే నెల 17 న ఆ ఇద్దరు మహిళల డీల్ జరగనుంది.

అయితే ఆ డీల్ జరిగిన అదే రోజు తాళిబొట్టును కూడా తీసి ఇచ్చేయాలని రమ్య ఆ మహిళకు మరో కండిషన్‌ను కూడా పెట్టిందట.అయితే అప్పటికే తనను ఏమాత్రం పట్టించుకోని భర్త విషయం లో విసిగిపోయిన ఆ మహిళా దానికి కూడా ఒకే చెప్పిందట.

ఆ ఇద్దరు మహిళలు డీల్ కుదుర్చుకుంటున్న సమయంలో ఆ భర్త గారు కూడా మధ్యలో ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయాడు.