డెలివరీకి పుట్టింటికెళ్లిన భార్య... మరో పెళ్లికి సిద్ధమైన భర్త..‌‌ఇంతలోనే.. 

పురుడుపొసుకున్నందుకు భార్య పుట్టింటికి వెళ్లడంతో ఈ గ్యాప్ లో ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నాడు మహానుభావుడు.ఇందుకు ముహూర్తం కూడా పెట్టేసాడు ఆ ప్రబుద్ధుడు (మహమ్మద్ జావిద్).

 Wife Went Mothers Home For Delivery Husband Getting Ready For Second Marriage In Pahadeshareef-TeluguStop.com

ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది పూర్తి వివరాల్లోకి వెళితే.పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జావిద్ అనే వ్యక్తికి ఇదివరకే పెళ్లయింది.

డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇదే అదునుగా చూసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు.పెళ్లి కార్డులు కూడా ప్రింటింగ్ చేయించుకున్నాడు.

 Wife Went Mothers Home For Delivery Husband Getting Ready For Second Marriage In Pahadeshareef-డెలివరీకి పుట్టింటికెళ్లిన భార్య… మరో పెళ్లికి సిద్ధమైన భర్త..‌‌ఇంతలోనే.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నెల 25న పెళ్లి చేసుకోన్నాను విషయం తెలుసుకున్న మొదటి భార్య ( డెలివరీకి పుట్టింటికెళ్లిన భార్య) నూతన వధువు, బంధువులకు సమాచారం ఇచ్చింది.దీంతో ఆ ప్రబుద్ధుడు నిజస్వరూపం బయటపడింది.

వధువు తల్లిదండ్రులు పెళ్ళికి నిరాకరించి, ప్రబుద్ధుడు కి దేహశుద్ధి చేసి అతని పట్టుకొని  పహాడీషరీప్ పోలీస్ స్టేషన్ కి అప్పగించారు.వధువు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

జావేద్ ని కఠినంగా శిక్షించాలని మొదటి భార్య తరపు బంధువులు, నవ వధువు తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

#Delivery #Second Marriage #Pahadeshareef #Police Arrest #Wife

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు