కోమాలోకి వెళ్ళిన కరోనా పేషెంట్ పక్కన కూర్చున్న భార్య ఏం చేసిందంటే?

గత ఏడాది నుంచి కరోనా విజృంభన గురించి అందరికీ తెలిసిందే.కరోనా వైరస్ వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 Wife Voice Heard By Corona Patient In Coma, South Carolina, Don Gilmour, Corona,-TeluguStop.com

మరికొంతమంది వైరస్ నుంచి తట్టుకొని బయట పడుతున్నారు.కాగా ఇటీవల తన భార్య చూపించిన ప్రేమతో తాను కోమాలో నుంచి బయట పడిన ఘటన చోటు చేసుకుంది.

అమెరికాలోని సౌత్ కరోలినా లో నివాసముంటున్న డాన్ గిల్ మర్, అతని భార్య.డాన్ గిల్ మర్ కు గత ఏడాది జూలైలో కరోనా సోకింది.దీంతో అతను హోమ్ క్వారంటైన్ లో ఉండగా విపరీతమైన దగ్గుతో నిద్రపోవడం కష్టమయ్యింది.దానిని తట్టుకునే శక్తి లేక వెంటనే బాన్ సెకార్స్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో చేరాడు.

సోషల్ మీడియా విరాళాల ద్వారా ఆస్పత్రి బిల్లు కట్టే వాడు.ట్రీట్మెంట్ సమయంలో గిల్ మర్ కు విపరీతమైన జ్వరం వచ్చింది.

Telugu Coma, Corona, Don, Heard, Quarantine, Carolina-Latest News - Telugu

అతి జ్వరం వల్ల అతనిని వైద్య చికిత్స కోసం ఏమీ చేయలేని స్థితిలో మరోమార్గం లేదంటూ కోమాలోకి పంపారు.ఆ రోజు రాత్రి చికిత్స చేస్తున్నప్పుడు మాత్రమే తన పరిస్థితి చూసి చెబుతామని వైద్యులు తెలిపారు.కాగా అతని భార్య తన పక్కన కూర్చొని ‘ నీకేం కాదు.నిన్ను డాక్టర్లు చాలా బాగా చూసుకుంటున్నారు.నువ్వు త్వరలో కోలుకుంటావని’ ధైర్యం చెప్పింది.కొన్ని రోజుల తర్వాత తను కోలుకున్నారు.

ఈ విధంగా తాను తన భార్య గురించి ”నిజంగా చెప్తున్నా.ఆ రోజు నా భార్య మాట్లాడిన మాటలు నాకు వినిపించాయి.ఆమె నా దేవత.నేను కోలుకుని ఇప్పుడు మీ ముందు ఉన్నానంటే దానికి కారణం నా భార్యనే” అని ధన్యవాదాలు తెలిపాడు.” ఈ రాత్రి గడిస్తే గాని ఏం చెప్పలేమని అన్న డాక్టర్లు.ఆరోజు నేను ధైర్యంగా ఉండటానికి కారణం నా దేవత” అని తన భార్య గురించి తెలిపాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube