భార్య నిప్పు పెట్టుకుంటే భర్త దారుణంగా ఫోన్ పట్టుకొని!

సాధారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకుంటే వారిని కాపాడటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాము.అలాంటిది మన కుటుంబ సభ్యులు ఇలాంటి ఘటనకు పాల్పడితే ఎలాగైనా వారి ప్రాణాలను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించి వారిని కాపాడుకుంటాము.

 Wife Sets Ablaze Herself Husband Records Video In Rajasthan-TeluguStop.com

కానీ ఇక్కడ మాత్రం తన భార్య మంటలలో కాలిపోతున్నా తన భర్తకాపాడాల్సింది పోయి.ఆమెపై ఎలాంటి కనికరం లేకుండా మంటల్లో కాలిపోతున్న ఆమెను సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి తన పుట్టింటి వారికి పంపించాడు.

ఇంతటి హృదయ విదారక ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే….,

 Wife Sets Ablaze Herself Husband Records Video In Rajasthan-భార్య నిప్పు పెట్టుకుంటే భర్త దారుణంగా ఫోన్ పట్టుకొని-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఝన్‌ఝను జిల్లాకి చెందిన వివాహిత ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టింది.అయితే అత్తవారింట్లో అదనపు కట్నం కోసం ఆమెను వేధింపులకు గురి చేశారు.ఈ వేధింపులను తట్టుకోలేక ఎంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

అయితే భార్య మంటల్లో తగలబడి పోతున్నా, కనీసం ఆమెపై ఏమాత్రం జాలి లేకుండా తన భర్త ఎంతో పైశాచికంతో వ్యవహరించాడు.తన భార్య అగ్నికీలల్లో కొట్టుమిట్టాడుతున్న, తనను రక్షించేది పోయి, తన భార్య మంటలలో చిక్కుకున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో వీడియోగా చిత్రీకరించి తమ అత్త వారికి పంపించాడు.

మంటల్లో కాలిపోయిన ఆ మహిళను సరైన చికిత్స కోసం ఈనెల 20వ తేదీన జైపూర్ ఆస్పత్రికి తరలించారు అయితే మంటల్లో ఎక్కువగా కాలి పోవడం వల్ల చికిత్స పొందుతూ ఈనెల 22న ఆ మహిళ మృతి చెందింది.దీంతో తీవ్ర ఆవేదన చెందిన మహిళ కుటుంబ సభ్యులు తమ అత్తింటివారి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా, అదనపు కట్నం కోసం అత్తింట్లో వేధింపులను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందని తేలడంతో వారిపై గృహ హింస 498 ఏ, ఆమె ఆత్మహత్యకు కారణమైనందుకు 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.

#Jaipur #JaipurWife #Extra Dowry #Phone Video #Women Suicide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు