ప్రముఖ వ్యాపారవేత్త భార్య... అనుమానాస్పద మృతి  

Wife Of Atlas Cycles Owner Found Hanging In Aurangzeb Lane-delhi,found Hanging,wife Of Atlas Cycles Owner

ఇండియాలో సైకిల్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే కంపెనీ అట్లాస్.అట్లాస్ కంపెనీ సైకిల్స్ తొక్కని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

Wife Of Atlas Cycles Owner Found Hanging In Aurangzeb Lane-Delhi Found

90-20 మధ్యలో ఈ బ్రాండ్ దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది.ఈ అట్లాస్ సైకిల్స్ సంస్థ అధినేత సంజయ్ కపూర్.

ఇండియాలో అపర కుభేరుల జాబితాలో ఇతను కూడా ఒకరు.ఇలాంటి వారి ఇంట్లో ఆత్మహత్య అంటే కాస్తా నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది.

కాని అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్ కపూర్ భార్య అనుమానాస్పద స్థితిలో మరణిస్తే అది ఎంత సంచలనం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో కాఫీడే అధినేత ఆత్మహత్య ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.

ఆ ఘటన మరిచిపోక ముందే ఇప్పుడు అలాంటి మరో ఘటన సంచలనంగా మారింది.

సంజయ్‌ కపూర్‌ భార్య నటాష్ కపూర్ అనుమానాస్పద స్థితిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే దీనికి ఆర్థిక సంక్షోభం కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

ఢిల్లీలోని ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో ఈ ఘటన జరిగింది.ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అయితే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.ఆమె చనిపోయే సమయంలో కొడుకు, కూతురు ఇంట్లో ఉండగా భర్త మాత్రం ఇంట్లో లేనట్లు తెలుస్తుంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం తల్లిని పిలవడానికి వెళ్ళిన కొడుకుకి నటాషా సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది.దీంతో షాక్ కి గురైన వారు పోలీసులకి సమాచారం అందించారు.

ఈ ఘటన ఏ కారణాలతో జరిగింది అనే దానిపై పూర్తి సమాచారం కోసం ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తాజా వార్తలు

Wife Of Atlas Cycles Owner Found Hanging In Aurangzeb Lane-delhi,found Hanging,wife Of Atlas Cycles Owner Related....