భర్తని చంపి మరో పెళ్ళికి రెడీ..చివర్లో ట్విస్ట్ చూసి షాక్ అయ్యింది       2018-05-14   06:43:54  IST  Raghu V

అక్రమసంభందాల ఘటనలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి..ఎక్కడ చూసినా ఇవే దారుణాలు వెలుగు చూస్తున్నాయి..తమ భందానికి అడ్డు వస్తోందని భర్త భార్యని చంపడం..ప్రియుడితో కలిసి ఉండటం కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చడం పరిపాటి అయ్యింది..తాజాగా జరిగిన ఓ సంఘటన అందరిని విస్తు పోయేలా చేసింది..ఇష్టం ఉన్నా లేక పోయినా పెళ్ళిళ్ళు చేసుకుని తరువాత మరొకరితో అక్రమ సంభంధం పెట్టుకుంటూ నమ్మి వచ్చిన భాగస్వామిని కదతెర్చుతున్నారు..వివరాలలోకి వెళ్తే.

తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన వాసుదేవన్‌ కొత్తూరు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు..అతడి భార్య రమాదేవి ఇంట్లోనే ఉంటుంది అయితే ఆమెకి రమేష్ అనే ఒక ఆర్ఎంపీ దాకర్ట్ తో వివాహేతర సంభంధం గత సంవత్సర కాలంగా జరుగుతోంది..అయితే తన భార్య పై అనుమానం వచ్చిన వాసుదేవ్ రమేష్‌ను హెచ్చరించాడు.

అయినా సరే అతడు వాసుదేవ్ మాటని లెక్కచేయలేదు సరికదా మరింతగా తన ఇంతకి రావడం మొదలు పెట్టాడు…ఈ క్రమంలో మూడునెలలుగా రమేష్‌, రమాదేవి కలుసుకోకుండా కట్టుదిట్టం చేశారు. అయితే తమ ఆనందానికి అడ్డుపడుతున్న తన భర్త ని అడ్డు తొలగించుకోవాలని ఎలాగైనా హతమార్చి ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోవాలని రమేష్‌, రమాదేవి అనుకున్నారు.

అయితే ఈ సమయంలోనే శనివారం వాసుదేవన్‌ బంగారుపాళ్యం మండలంలోని బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వెళ్లాడు…తిరిగి వచ్చే క్రమంలో మార్గ మధ్యలో నిందితుడు రమేష్‌ వడ్డివానిచెరువు మార్గంలో సుమోతో కాపు కాశాడు..వాసుదేవ్ అక్కడికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఎదురెళ్లి ఢీ కొట్టాడు. ఉపాధ్యాయుడు గాయాలకు గురై.. పారిపోయి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు మళ్లీ వాహనంతో ఢీ కొట్టాడు.దాంతో అతడి అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే ఇక తమ మధ్య అడ్డు తొలిగి పోయిందని అనుకున్న నిందితులు రమేష్‌, రమాదేవి పారిపోయి పెళ్లి చేసుకొనేందుకు ఆదివారం కేజీ సత్రం బస్టాండు వద్ద బస్సు కోసం వేచి ఉండగా పలమనేరు రూరల్‌ సీఐ మధుసూదనరావు అరెస్టు చేసినట్లు డీఎస్పీ చౌడేశ్వరి చెప్పారు..