ఆ క్రికెటర్ మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య

ఒంటరితనం ఆడవాళ్ళకి పెద్ద శాపం అని చెప్పాలి.భర్త తన ఉద్యోగ బాద్యతలు, విధి నిర్వహణలో బయటకి వెళ్ళిపోతే రోజుల నుంచి నెలల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండాలి.

 Wife Leaves Note For Self Isolated Mitchell Mcclenaghan-TeluguStop.com

అయితే ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకి ఒంటరితనం అనేది పెద్ద సమస్య కాకపోయినా ఇంటి వద్ద ఉండేవారికి మాత్రం కాస్తా ఇబ్బందికరంగానే ఉంటుంది.ఆ ఒంటరితనం భరించలేక ఇప్పుడు ఓ క్రికెటర్ భార్య భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది.

దానికి సంబందించిన విషయాన్ని ఆ క్రికెటర్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.వివరాలలోకి వెళ్తే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్ మెక్ క్లీన్ గన్ తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న ఇతడు కరోనా భయంతో న్యూజిలాండ్ కు తిరిగి వచ్చేశాడు.

విదేశాల నుంచి అతనిని న్యూజిలాండ్ ప్రభుత్వం 14రోజులు పర్యవేక్షణలో ఉండాలని సూచించింది.దీంతో మెక్ క్లీన్ గన్ కూడా న్యూజిలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో 14రోజులు ఉండి తరువాత ఇంటికెళ్లాడు.

అయితే మెక్ క్లీన్ గన్ కి అతని భార్య షాక్ ఇచ్చే విధంగా ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్ళిపోయింది.ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎంత అసహనం కలిగిస్తుందో చూడు.

నువ్వు లేనప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియాలి.అందుకే నేను మా అమ్మ వారింటికి వెళ్లిపోతున్నా.

నువ్వు నీ భార్యతో ఉండలేకపోతున్నావ్ అంటూ బాధతో లెటర్ రాసి ఫ్రిజ్ పై అంటేసి వెళ్లిపోయింది.తన భార్య రాసిన లేఖను ఫొటో తీసి మెక్ క్లీన్ గన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫొటో ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube