మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తకు బుద్ది చెప్పాలని ఆ భార్య ఏం చేసిందో తెలుసా?

ఆడది ఏదైనా సహిస్తుంది కానీ…తన భర్తను మరొకరు పంచుకోవడం చూస్తే అస్సలు సహించదు అనే డైలాగ్ చాలా సినిమాల్లో చూసే ఉంటాము.కొంతమంది బాధను వేరే వాళ్లకి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు.

 Wife Learned A Lesson To Husband His Illegal Relationship-TeluguStop.com

మరికొంత మంది విడాకులు తీసుకుంటారు.కానీ ఆ మహిళ మాత్రం తగిన గుణపాఠం నేర్పింది.

దెబ్బకు అతను మళ్ళీ ప్రియురాలి జోలికి వెళ్ళలేదు.విశాఖపట్నం కు అతి సమీపంలోని అరకులో జరిగిన ఈ సంఘటన చోటుచేసుకుంది.

అరకుకి చెందిన తులసి, శ్రీకాకుళం కి చెందిన వనజకు పెద్దలు నెలక్రితం వివాహం చేసారు.పెళ్ళైన దగ్గరినుండి భర్త తులసి.భార్యను ఫోన్ నెంబర్ మార్చెయ్యమన్నాడు.స్లీవ్ లెస్ డ్రస్సులు, జాకెట్లకు రంద్రాలు ఉండడం, ఫ్రెండ్స్ తో మాట్లాడడం అని మానుకోమన్నాడు.

ఫేస్ బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయమన్నాడు.దీంతో వనజ అన్నింటినీ వదులుకుంది.

నెల రోజుల వరకు భార్యను బాగానే చూసుకున్నాడు.ఆ ఆరువాత అసలు కథ మొదలైంది.

పెళ్ళికి తులసికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది.ఆమెతో మళ్ళీ పరిచయం పెట్టుకున్నాడు.ఫోన్లు, ఛాటింగ్‌లు చేస్తూ భార్యను మరిచిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భార్య భర్తను వేడుకుంది.తనకు అన్యాయం చేయొద్దని బతిమిలాడింది.అయితే అతను ఒప్పుకోలేదు.

దీంతో వనజ కూడా ఒకడుగు ముందుకు వేసింది.భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది.

ఫేస్ బుక్ అకౌంట్‌ను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసింది.

గతంలో తనకు ఉన్న పరిచయాలతో బాయ్ ఫ్రెండ్లతో చాటింగ్ మొదలెట్టింది.

ఫోన్లలో గంటల తరబడి మాట్లాడటం ప్రారంభించింది.పరిచయం లేని వ్యక్తులతోను గంటల తరబడి మాట్లాడేది.

ఈ విషయంపై భార్యాభర్తలు ఎప్పుడు గొడవపడే వారు.అయినా వనజ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

దీంతో భర్త ఓ మెట్టు దిగిరావాల్సి వచ్చింది.ఇలా తన భర్త తనకు బాగా దగ్గరయ్యాడని, ఇప్పుడు ఎలాంటి సమస్య లేదంటోంది వనజ.ఎలాంటి ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది వనజ.

note: featured image used in this article is only for reference.but not the actual characters

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube