భర్తను చంపమని ప్రియుడ్ని పురమాయించిన భార్య.. చివరకు..

ఈ మధ్య పవిత్రమైన వివాహబంధం వివాహేతర సంబంధాల కారణంగా అపవిత్రం అవుతున్నాయి.పరాయి వ్యక్తిపై వ్యామోహం వల్ల అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఒక్కటైన బంధాన్ని మర్చిపోతున్నారు.

 Wife Kills Husband With The Help Of Her Boy Friend-TeluguStop.com

భార్యాభర్తల మధ్య పరపురుషుడు రావడం వల్ల అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు కూడా గొడవలు పడుతున్నారు.ఆ గొడవలు కాస్తా పెద్దగా అవ్వడంతో ఒకరిని ఒకరు చంపుకునే వరకు వెళ్తున్నారు.

తాజాగా కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.పరాయి వ్యక్తి మోజులో పడి తాళి కట్టిన భర్తనే తనకు అడ్డు తొలగించుకోవడానికి చంపాలనుకుంది.ప్రియుడి చేతనే కట్టుకున్న భర్తను హతమార్చాలని ప్లాన్ వేసింది.ఆ విషయాన్నీ ప్రియుడికి చెప్పడంతో అతడు ఆమె భర్తను బయటకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి మత్తులో ఉండగానే కెనాల్లోకి తోసేసాడు.

 Wife Kills Husband With The Help Of Her Boy Friend-భర్తను చంపమని ప్రియుడ్ని పురమాయించిన భార్య.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె ఏమి ఎరగనట్టు పోలీసులకు తన భర్త కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంరేకుర్తి గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు.అతను మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.రాజయ్య భార్య లత కూడా తాపీ పనికి వెళ్ళేది.ఈ క్రమంలో లతకు ఆమె పనిచేస్తున్న మేస్త్రీ బాబుకు మధ్య వివాహేతర సంభందం ఏర్పడింది.

వారిద్దరూ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన భర్త లతను హెచ్చరించాడు.

అయితే లత తనకు అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చాలని అనుకుని ఈ విషయాన్నీ బాబుకు చెప్పడంతో అతడు ఫిబ్రవరి 5 నరాజయ్యను ఫంక్షన్ ఉందని బయటకు తీసుకెళ్లాడు.

బాబు తన గ్రామానికి తీసుకెళ్లి రాజయ్యకు ఫుల్లుగా కల్లు తాగించాడు.తర్వాత అతడిని ఆటోలో ఎక్కించుకుని రాత్రి 7 గంటల సమయంలో ఎస్సారెస్పీ కెనాల్ దగ్గరకు తీసుకెళ్లి అతడిని తోసేసాడు.

తర్వాత లత ఏమి ఎరగనట్టు తన భర్త కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు ఎంత వెతికిన రాజయ్య కనిపించలేదు.

రాజయ్య మృతదేహం దాదాపు 150 కిలోమీటర్లు నీటిలో కొట్టుకుపోయి మహబూబాబాద్ పోలీసులకు దొరికింది.ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు లతను, ఆమె బంధువులను అక్కడికి తీసుకెళ్లి రాజయ్య మృతదేహాన్ని గుర్తించారు.

లత కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అనుమానం వచ్చి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసారు.

#Karimnagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు