“65 ఏళ్ల” భర్తని గొడ్డలితో నరికేసిన భార్య...రీజన్ ఇదే       2018-06-09   00:33:19  IST  Raghu V

మద్యం మత్తులో ఎన్నో ఘోరాలు నేరాలు జరిగిపోతూ ఉంటాయి ఎంత మంచి వ్యక్తిని అయినా సరే మద్యంకి బానిస అయ్యాడు అంటే ఎదో ఒక రోజున ఘోరమైన చావుకి దగ్గరగా వెళ్తున్నాడు అనే అర్థం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము తాడుగుకి ఖర్చు పెట్టి భార్యా పిల్లలకి నరకం చూపించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..ఎన్నో జీవితాలు మద్యం బారిన పడి నాశనం అయ్యాయి కూడా అయితే తాజాగా వెలుగు చూసిన ఘటన ఇందుకు నిదర్శనం వివరాలలోకి వెళ్తే..

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం గొల్లపల్లి కి చెందిన కొక్కుల ఓదెలు 65 ఏళ్ళు సింగరేణిలో కారికుడిగా చేసి ఉద్యోగ విరమణ పొందాడు తాడుడికి అలవాటు అయిన ఓదెలు భార్యతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు..ఉద్యోగం చేసే సమయంలో కూడా ఇదే రకమైన పరిస్తితిని ఆమె ఎదుర్కొంది కూడా ఐతే మద్యం సేవించే అలవాటు ఉన్న ఓదెలు తరుచూ భార్యతో గొడవ పెట్టుకుంటూ. భార్యని కొట్టేవాడు అయితే ఈ క్రమంలో తీవ్రమైన మనస్థాపానికి లోనయిన ఆమె మద్యం మత్తులో పడుకున్న తన భర్తని గొడ్డలితో తలపై రెండు సార్లు నరికేసింది..

అయినా అతడు చనిపోక పోవడంతో…కర్రతో తలపై బాదింది. ప్రాణాలు కోల్పోయిన తరువాత గొడ్డలిని, కర్రలను కడిగి దాచిపెట్టి..ఇంటి పక్కనే ఉన్న వారిని లేపి నా భర్తని నలుగురు దొంగలు వచ్చి కొట్టి చంపి వేశారని కధ అల్లింది..అదే రాత్రి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఏసీపీ ఇంట్లో ఉన్న వస్తువులు, నగదు, బంగారం దోచుకెళ్లారా అని రాజమ్మను ప్రశ్నించారు.

అయితే పోలీసులు రావడం వారు అనుమానంగా ఆమెని ప్రశ్నించడం ఈ క్రమంలో ఆమె తడబాటుకి లోనవ్వడం చూసిన పోలీసులు ఆమెని సరిగ్గా వివరాలు అడిగే సరికి ఆమె తన భర్త పెట్టె హింస భరించలేక గొడ్డలితో నరికేశాను అని తెలిపింది..అయితే ఆమె నుంచీ గొడ్డలి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆమెని అరెస్టు చేశారు..

,