కన్న కొడుకుతో భర్తను చంపేయించింది... ఎందుకో తెలిస్తే ఆమెను నడి రోడ్డుమీద ఉరి తీయాలంటారు  

Wife Kills Husband Because Of Illegal Affair-illegal Affair,mother,son,జైలు,విభేదాలు,సహజీవనం

అక్రమ సంబంధం ఎంతకైనా తెగించేలా చేస్తుందని మరోసారి నిరూపితం అయ్యింది. గతంలో మనం ఎన్నో సంఘటనలు చూశాం. భర్తను చంపేసి ఆ స్థానంలోకి ప్రియుడిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నించడం, భర్తను చంపేసి ఏమీ తెలియనట్లుగా వ్యవహరించడం చేసిన ఎంతో మంది భార్యలను మనం చూశాం..

కన్న కొడుకుతో భర్తను చంపేయించింది... ఎందుకో తెలిస్తే ఆమెను నడి రోడ్డుమీద ఉరి తీయాలంటారు-Wife Kills Husband Because Of Illegal Affair

అయితే ఈమె మరో అడుగు ముందుకు వేసింది. అక్రమ సంబంధంను సక్రమం చేసుకునేందుకు భర్తను మరియు కొడుకును వదిలించుకోవాలని చూసింది. అందుకోసం ఆమె వేసిన ప్లాన్‌ ఈ ప్రపంచంలో ఏ కన్న తల్లి వేయదని చెప్పుకోవాలి.

అలాంటి నీచురాలిని నడి రోడ్డుమీద ఉరి తీసినా ఏమాత్రం తప్పు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆస్ట్రేలియాకు చెందిన స్టెల్లామేరి అనే 43 ఏళ్ల మహిళ 35 ఏళ్ల డేనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన విషయం ఎప్పటికైనా భర్తకు మరియు కొడుకుకు తెలుస్తుందనే భయం ఆమెకు పట్టుకుంది. ఎప్పుడైతే వారికి తెలుస్తుందో అప్పుడు డేనితో నేను కలవడం సాధ్యం కాదు.

భార్య నుండి దూరంగా ఉంటున్న డేనిని పెళ్లి చేసుకోవాలి. అతడితోనే కలిసి జీవితంను పంచుకోవాలని భావించిన స్టెల్లా భర్తను చంపేయాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే తానే చంపేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

అప్పుడు డేనితో జీవితాన్ని పంచుకునే అవకాశం మిస్‌ అవుతుందని భావించింది. అందుకు కొడుకును ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది.

19 ఏళ్ల కొడుకుకు స్టెల్లామేరి తండ్రి గురించి లేని పోని అబద్దాలు చెప్పింది. మొదట ఇద్దరి మద్య విభేదాలు వచ్చేలా చేసింది.

ఆ తర్వాత కొడుకుకు నీన్ను నీ తండ్రి చంపేందుకు చూస్తున్నాడు అంటూ అబద్దం చెప్పింది. అతడి ప్రవర్తన అనుమానంగా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ దొంగ ప్రేమ వలకబోసింది. ఆ కుర్రాడు ఆమెను పూర్తిగా నమ్మేశాడు..

తండ్రి అక్రమ సంబంధంతో తనను చంపేయాలని నిర్ణయించుకున్నట్లుగా అతడు భావించాడు.

తండ్రి చేతిలో చనిపోకముందే తండ్రిని చంపేయాలని భావించాడు. ఆ విషయాన్ని తల్లికి చెప్తే ఆమె మరింత సమర్ధించి, ఉసిగొల్పింది. దాంతో అతడు తండ్రిని చంపేసి జైలు పాలయ్యాడు.

స్టెల్లా అనుకున్నట్లుగా ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టింది. అయితే కేసు లోతుగా విచారణ జరుపుతున్న సమయంలో స్టెల్లా మేరి కుట్ర బయట పడింది. ప్రస్తుతం స్టెల్లా కూడా జైల్లో ఉంది..

ఇలాంటి వ్యక్తిని జైలులో పెట్టకుండా నడి రోడ్డు మీద ఉరి తీయాలి.