భర్తకు బీమా చేపించి, ఆపై హత్య చేసిన భార్య... చివరకు ...?

ఓ వివాహితుడు మద్యానికి బానిసై ఇంట్లో ఉండే వారిని వేధించసాగాడు.అంతే కాదు అతని సొంత కుమార్తె పై కూడా అసభ్యంగా ప్రవర్తించాడు.

 A Wife Who Insured Her Husband And Then Killed Him, But Finally, Wife , Insurenc-TeluguStop.com

ఇక దీంతో విసిగిపోయిన తన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయం తీసేసుకుంది.అయితే ఆమెకు అసలు కుటుంబ పెద్దను హత్య చేస్తే తర్వాత వారి పరిస్థితి ఏంటని ఆలోచించిన ఆమె ఏకంగా రూ.20 లక్షల రూపాయలకు బీమా చేయించి మరి తన భర్తని హత్య చేసింది.ఇకపోతే ఈ హత్యకు తన బావ, సోదరి సహకారం కూడా తీసుకుంది.

ఈ సంఘటన తెలంగాణ లోని వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది.మద్యానికి బానిసైన తన భర్తని హతమార్చేందుకు తన బావ భూక్యా బిచ్చాల, తన సోదరి భూక్యా బుజ్జి సహకారాన్ని తీసుకుంది.ఇక ఈ హత్యకు వారు సహకరిస్తామని తెలిపాక దగ్గర్లో ఉన్న గ్రామీణ బ్యాంకు లో ఏకంగా రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు.అయితే ఈ నెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు సైకిల్ పై వెళ్ళాడు.అయితే ఈ సమాచారాన్ని వీరన్న భార్య, బావ భూక్యా బిచ్చాల కు తెలియజేయడంతో అతడు నెక్కొండ ప్రాంతంలో సాయంత్రం పూట వారిద్దరూ కలిసి తన ద్విచక్రవాహనంపై వీరన్న ను ఎక్కించుకొని హత్య చేసేందుకు బయలుదేరాడు.

Telugu Bukya Bichhala, Bukya Veeranna, Grameena Bank, Insurence, Nekkonda, Telan

ఇక ఆ హత్య ప్లాన్ లో భాగంగా మార్గమధ్యంలో మద్యం తాగించి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11 గంటల సమయంలో తీసుకువెళ్లగా ఆ సమయానికి అప్పటికే వీరన్న భార్య సోదరి బుజ్జి అక్కడికి వచ్చారు.ఆ తరువాత వారందరూ కలిసి వీరన్న కు తాడుతో ఉరివేసి హత్య చేసి, మళ్లీ అతను బతికి ఉన్నాడేమోన్న అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి దగ్గరలో ఉన్న కెనాల్ లో పడేశారు.అనంతరం బుజ్జి, బిచ్చాల తమ స్వగ్రామానికి వెళ్లిపోగా… వీరన్న భార్య మాత్రం తన భర్త ని ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది.దీంతో పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారికి అనుమానం రావడంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో విచారించగా చివరకు తామే హత్య చేశామని వారు అంగీకరించారు.

దీంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube