విడ్డూరం: స్నానం చేస్తున్నాడని భర్తకు విడాకులిచ్చిన భార్య  

Wife Gives Divorce To Husband For Over Cleanliness - Telugu Bathing, Bengaluru News, Divorce, Husband, Ocd, Wife

ఒక వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండుసార్లు స్నానం చేయడం మనం చూస్తుంటాం.రెండురోజులకు ఒకసారి స్నానం చేసే వారి గురించి కూడా మనం వినుంటాం.

Wife Gives Divorce To Husband For Over Cleanliness

కానీ ఓ భర్త రోజంతా స్నానం చేస్తున్నాడని విసుగు చెందిన భార్య అతడికి విడాకులిచ్చిన ఘటన బెంగుళూరు నగరంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.

బెంగుళూరుకు చెందిన ఓ టెక్కీ(32) తన శరీరం అపరిశుభ్రంగా ఉందని రోజుకు 8 గంటలపాటు స్నానానికే కేటాయించేవాడు.ఒక్కసారి బాత్రూంకు వెళితే ఓ సబ్బు పూర్తిగా అరగాల్సిందే.

తమ పుత్రుడి వింత ప్రవర్తన చూసిన అతడి తల్లి, వివాహం జరిగితే మారుతాడని ఓ అమ్మాయిని చూసి ఆ కార్యం కూడా కానిచ్చేసింది.కానీ మనోడికి బాత్రూం అలవాటు మాత్రం మారలేదు.

రోజూ ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ఇదే తతంగం చేస్తూ గడిపాడు.

దీంతో అతడి భార్యకు మనోడిపై ఏదో అనుమానం కలగగా, అతడికి అతిశుభ్రంగా ఉండే అబ్సెస్సివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) లేదా గీళు జబ్బు ఉందని తెలిసింది.

దీంతో ఆ భర్త వద్దంటూ భార్య విడాకులు తీసుకుంది.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.కాగా వైద్యుల సహాయంతో ప్రస్తుతం అతడు అతిగా స్నానం చేసే అలవాటును తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Wife Gives Divorce To Husband For Over Cleanliness Related Telugu News,Photos/Pics,Images..

footer-test