భార్య పురుగుల మందు తాగింది... భర్త చనిపోయాడు.. ఏం జరిగిందంటే..?  

Wife Drinks Poison Husband Died.. Story Mystery - Telugu Ap Prakasham Distict, Illigal Affairs, Venu Babu And Malleswari, Venu Babu In Prakasham Distcit, Wife,

ఏపీలోని ప్రకాశం జిల్లాలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణం పోవటానికి కారణమైంది.భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో భార్య భర్తను వివాహేతర సంబంధం గురించి నిలదీసింది.

Wife Drinks Poison Husband Died.. Story Mystery

మరొక మహిళతో భర్త తిరుగుతున్నాడనే విషయాన్ని తట్టుకోలేక పురుగులమందు తాగగా అదే సమయంలో ప్రియురాలు నదిలో ఆత్మ హత్యచేసుకోవాలని దూకింది.ప్రియురాలిని రక్షించే ప్రయత్నంలో నదిలోకి దిగిన ప్రియుడు చనిపోయాడు.

పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లాలోని అద్దంకికి చెందిన వేణుబాబు అనే వ్యక్తి మేస్త్రీ పని చేస్తూ తన భార్యతో కలిసి జీవనం సాగించేవాడు.ఆ సమయంలో మరో వ్యక్తి భార్య మల్లేశ్వరితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఆ తరువాత మల్లేశ్వరి కుటుంబం కొన్ని కారణాల వలన హైదరాబాద్ కు మకాం మార్చింది.హైదరాబాద్ లో ఉన్నా మల్లేశ్వరి వేణుబాబుతో తరచూ ఫోన్ లో మాట్లాడటం చేసేది.

నాలుగు రోజుల క్రితం వేణు బాబును కలవడానికి మల్లేశ్వరి అద్దంకికి వచ్చింది.అదే సమయంలో ఇంట్లో భర్త మల్లేశ్వరితో సన్నిహితంగా దిగిన ఫోటో కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ ఫోన్ చేసి భర్త వేణు బాబును వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించి పురుగుల మందు తాగింది.

తన భార్య పురుగుల మందు తాగిందని వివాహేతర సంబంధం ఇక్కడితో ఆపేద్దామని తనకు పెళ్లై పిల్లలున్నారని మరో పెళ్లి చేసుకోవడం కుదరదని వేణుబాబు చెప్పటంతో మల్లేశ్వరి నదిలో దూకేసింది.మల్లేశ్వరి నదిలోకి దూకటంతో రక్షించే ప్రయత్నం చేసిన వేణు బాబు మృతి చెందాడు.

స్థానికులు అతికష్టం మీద మల్లేశ్వరిని కాపాడామని వేణుబాబును కాపాడలేకపోయామని చెబుతున్నారు.

తాజా వార్తలు