క్రికెట్ బ్యాట్‌తో భర్తను చితక్కొట్టిన భార్య.. వీడియో వైరల్!

తాజాగా ఒక దంపతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్‌తో చితక్కొట్టుడు కొట్టింది.

 Wife Crushes Husband With Cricket Bat Video Goes Viral , Cricket Bat, Viral Latest, News Viral, Social Media, Viral, Wife Husband,cctv Footage,police Station, Fight ,couple Fight Video-TeluguStop.com

ఇల్లంతా ఉరికిస్తూ మరీ తన భర్తను భార్య ఉతక బాదుడు బాదింది.ఈ దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.

ఈ వీడియోని స్వయానా భర్తే అందరికీ చూపించి తన భార్య ఆగడాలు బయట పెట్టారు.అంతేకాదు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తన సతీమణి పై కేసు కూడా వేయించారు.

 Wife Crushes Husband With Cricket Bat Video Goes Viral , Cricket Bat, Viral Latest, News Viral, Social Media, Viral, Wife Husband,CCTV Footage,Police Station, Fight ,Couple Fight Video-క్రికెట్ బ్యాట్‌తో భర్తను చితక్కొట్టిన భార్య.. వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన భార్య తన భావతో కలిసి అక్రమ సంబంధం పెట్టుకుందని.సదరు బావ రెచ్చగొడుతుండటంతో.

తనని అనవసరంగా కొడుతుందని భర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.

రాజస్థాన్ రాష్ట్రం అల్వార్‌లోని బివాడికి చెందిన అజిత్ యాదవ్ తన భార్యా పిల్లలతో కలిసి హాయిగా జీవించేవారు.ఇతను ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్‌గా పనిచేస్తున్నారు.

అజిత్ సుమనా అనే ఒక మహిళను తొమ్మిదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.అయితే మొదట వీరి పెళ్లి జీవితం సుఖసంతోషాలతో సాగింది.

వీరికి ఒక ఎనిమిదేళ్ల బాబు కూడా ఉన్నాడు.

అయితే గత కొన్ని రోజులుగా వైఫ్ సుమనా అజిత్‌ను ఇష్టమొచ్చినట్లు కొడుతోంది.

ఈ విషయం బయట చెప్పుకుంటే ఎక్కడ నవ్విపోతారేమోనని అతను గప్‌చిప్‌గా ఇన్ని రోజులు అని తనలో తానే కుంగిపోయాడు.అయితే ఇటీవల క్రికెట్ బ్యాట్‌తో ప్రాణాలు పోయేట్టు కొట్టడంతో అది భరించలేక అతను పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు.

అలాగే కోర్టు మెట్లెక్కి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు.

అయితే ఈ భార్య బాధిత ఉపాధ్యాయుడికి భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అయ్యో పాపం అని చాలామంది సానుభూతి చూపుతారు.భర్త భార్యను కొట్టడం చూశాం కానీ భార్య భర్తను ఈ రేంజ్ లో దంచికొట్టడం చూడటం ఇదే తొలిసారి అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వీడియో చూసేందుకు ఫన్నీగా ఉందని చాలామంది కామెంట్ చేసినా కొందరు మాత్రం అసలైన ఇది చాలా బాధాకరం అని కామెంట్ చేస్తున్నారు.గృహహింస చట్టం కింద ఈ భార్యకు తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నారు.

అలానే ఇంట్లో సీసీ టీవీ సెటప్ చేసి భార్య నిజస్వరూపాన్ని అందరికీ చూపించిన భర్తను తెలివైన వాడిగా పొగుడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube