అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.అమ్మాయి అయితే ఇంకొక అడుగు ముందుకేసి మరికొంత మేకప్ జోడించి అందంగా కనిపించాలని ఆరాటపడుతుంటారు.
ఈ విధంగా అందంగా కనిపించడానికి రోజూ కొంత సమయం వారు మేకప్ వేసుకోవడం కోసమే కేటాయిస్తారు.ఈ విధంగానే ఓ మహిళ 22 ఏళ్ల క్రితం మేకప్ వేసుకుని ఎంతో అందంగా ముస్తాబయింది.
మేకప్ లో తనను చూసిన తన భర్త ఎంతో అందంగా ఉన్నావు అని చెప్పడంతో తన భర్త కోసం రోజు మేకప్ వేసుకునేది.చివరికి ఒకరోజు మేకప్ లేకుండా తన భర్తకు కనిపించింది.
ఇంకేముంది వారిద్దరి మధ్య గొడవలే గొడవలు.ఈ సందర్భంగా ఆ భార్య మాట్లాడుతూ…
22 సంవత్సరాల క్రితం మేకప్ వేసుకొని తన భర్తకు కనిపించడంతో ఎంతో ఆనందపడ్డాడు.
తన భర్త ఆనందం కోసం ప్రతిరోజు ఒక గంట సమయం అందంగా తయారవడానికి కేటాయిస్తున్నాను.ఈ విధంగా 22 సంవత్సరాల పాటు మేకప్ వేసుకుంటూ తన భర్తకు కనిపించడం వల్ల వీరి దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్థలు తలెత్తకుండా ఉన్నాయని ఆ మహిళ తెలిపింది.
కానీ ఆదివారం మేకప్ వేసుకోవడానికి విసుగు చెందిన ఆ మహిళ ఎలాంటి మేకప్ లేకుండా తన భర్త ముందు కనిపించింది.మేకప్ లేకుండా తన భర్త తనని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.మేకప్ లేకుండా ఉంటే బాగా లేనని ప్రతి రోజు ఆమెను దూషించడం మొదలుపెట్టాడు.ఆ విధంగా వీరి మధ్య తరచు మనస్పర్థలు తలెత్తుతున్నాయి.మేకప్ లేకుండా కేవలం మాయిశ్చరైజర్ తో సరిపెడుతున్నప్పటికీ, తన భర్తకు నచ్చడం లేదంటూ ఆ భార్య తెలియజేసింది.