దారుణం : భార్య చదువుల కోసం 25 లక్షలు ఖర్చు చేశాడు... చదువయ్యాక ఆమె అసలు బుద్ది చూపింది  

Wife Cheated Husband For 25 Lakhs-

ప్రతిభ ఉన్నా కూడా కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కారణంగా తమ పిల్లల చదువు విషయంలో పట్టించుకోకుండా పెళ్లి చేస్తూ ఉంటారు.ఎంతో ప్రతిభ ఉండే అమ్మాయిలు పెళ్లి తర్వాత వంటింటి కుందేళ్లు అవుతారు.ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే తమ జీవితంలో ముందుకు సాగేందుకు భర్తల సహకారం పొందుతారు...

Wife Cheated Husband For 25 Lakhs--Wife Cheated Husband For 25 Lakhs-

ఆర్థికంగా భర్త మంచి స్థితిలో ఉంటే భార్యను చదివించడంతో పాటు, ఆమె కోరుకున్న కెరీర్‌లో రాణించేందుకు మద్దతుగా నిలుస్తాడు.అయితే కొందరు భార్యలు తమకు భర్తలు ఇచ్చిన ప్రోత్సాహంను సద్వినియోగం చేసుకుంటారు మరికొందరు మాత్రం దుర్వినియోగం చేసుకుంటారు.

తాజాగా పంజాబ్‌లోని మోగాలో ఒక దారుణ సంఘటన జరిగింది.

Wife Cheated Husband For 25 Lakhs--Wife Cheated Husband For 25 Lakhs-

స్థానికంగా ఒక సింగ్‌ తన భార్యకు చదువుపై ఉన్న ఆసక్తిని తెలుసుకుని ఆమెను ఉన్నత చదువులు చదివించేందుకు సిద్దం అయ్యాడు.భర్త ఉన్నత చదువులు చదివించేందుకు ఒప్పుకోవడంతో ఆమె సంతోషం పట్టలేక పోయింది.చాలా కాలంగా అనుకుంటున్న కెనడా ఎడ్యుకేషన్‌కు ఆమె సిద్దం అయ్యింది.

అక్కడ చదివి, అక్కడే ఉద్యోగం చూసుకుని భర్తను తీసుకు వెళ్తానని మాట ఇచ్చింది.

భార్య మంచి ఉద్యోగం చేసి తనను కెనడా తీసుకు వెళ్తుందేమో అనే ఉద్దేశ్యంతో సదరు సింగ్‌ ఆమెకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు.మొత్తంగా 25.70 లక్షల రూపాయలు అతడు ఖర్చు చేశాడు.అందులో కొంత భాగం అప్పుగా కూడా తీసుకు వచ్చి పెట్టాడు.ఆమె చదువు అంతా పూర్తి అయిన తర్వాత ఇండియాకు వచ్చి భర్త వద్దకు వెళ్లకుండా ప్రియుడి వద్దకు వెళ్లి అతడిని తీసుకుని కెనడా వెళ్లింది.

విషయం తెలిసిన భర్తకు ఏం చేయాలో పాలుపోలేదు.తాను మోసపోయాను అని తెలుసుకున్నాడు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు...

ఆమెను కెనడా నుండి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇప్పటికే ఆమెకు సహకరించినందుకు గాను ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఆమె కూడా త్వరలోనే ఇండియాకు వస్తుందని పోలీసులు అంటున్నారు.