ప్రియురాలి ముందే భర్తకు బడితి పూజ!!!  

Wife Beats Husband Before His Keep-

భర్త కోసం భార్య రోడ్డెక్కింది.కట్టుకున్న భర్త తప్పుడు మార్గంలో పయనిస్తూ ఉంటే నడి రోడ్డుపైనే అతనికి బుద్ది చెప్పింది..

Wife Beats Husband Before His Keep---

వివరాల్ళోకి వెళితే…బోరబండ ఓ కంపెనీలో ఎలక్ర్టిషన్‌గా పని చేస్తున్న శివయ్యకు పద్మతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.భార్యా, పిల్లలతో కలిసి మాదాపూర్ లో నివాసం ఉంటున్నాడు శివయ్య.ఇంతవరకు బాగానే ఉన్నా, శివయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.గత కొద్ది రోజులుగా ఇంటికి కూడా రావడం మానేసిన శివయ్యను గమనించిన భార్య పద్మ ఆరా తీయగా భర్త వివాహేత సంబంధం పెట్టుకున్న విషయం బయటపడింది.

మహిళ ఇంట్లోనే భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య పద్మ బంధువులతో కలిసి రోడ్డుపైనే చితకబాదింది.ప్రియురాలి ముందే భర్తకు దేహసుద్ది చేసి పోలీసులకు అప్పగించింది.ఇక పోలీసులు సైతం కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు.