ఇకపై భర్త అలా శృంగారం చేస్తే...భార్య విడాకులు తీసుకోవచ్చు అంట.! షాకింగ్ తీర్పు!     2018-06-11   01:02:02  IST  Raghu V

భార్యభర్తల మధ్య గిల్లికజ్జాలు సహజం.కానీ ఆ గొడవలు శృతిమించితే దానికంటే నరకం మరొకటి ఉండదు.తన తల్లిదండ్రులను ,కుటుంబాన్ని,తను ఉన్న పెరిగిన చోటుని కాదని ఎవరో ముక్కుముఖం తెలియని పర్సన్ ని పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో మరొక ఇంటికి చేరుకున్న అమ్మాయికి అక్కడ అంతా సవ్యంగా ఉంటే ఒకే. లేదంటే విడాకులు, మరీ కాదంటే ఆత్మహత్యలు.

దంపతులు రతిక్రీడలో పాల్గొనడంలో వింత ఏమి ఉండదు. కానీ ఇప్పుడు జీవిత భాగస్వామికి ఇష్టం లేకుండా చేసే బలవంతపు శృంగారం, అసహజ లైంగిక చర్యలపై విడాకులకు వెళ్ల వచ్చని పంజాబ్‌, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఒక మహిళ చేసిన విజ్ఞప్తిపై విచారణ నిర్వహించిన ధర్మాసనం ఆమె విజ్ఞప్తిని మన్నించింది.

తన భర్త అతని కోర్కె తీర్చుకోవడం కోసం తనను తరచూ కొట్టేవాడని, అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవాడని ఆమె ఆరోపించింది. ఆమె విజ్ఞప్తిని దిగువ న్యాయస్థానం తోసిపుచ్చగా హైకోర్టును ఆశ్రయించింది.