పిల్లలు పుట్టకపోవడానికి చాలామందికి తెలియని ప్రధాన కారణం ఇదే.! తప్పక తెలుసుకొని జాగ్రత్తపడండి!       2018-06-23   03:09:43  IST  Raghu V

సంతాన లేమి…ఇప్పుడు ఈ సమస్య చాలా మంది దంపతులను వేధిస్తున్న సమస్య, పెళ్ళై అయిదేళ్లు దాటినా..ఇంకా పిల్లలేరని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇదే సమయంలో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొచ్చాయి. అమ్మ అవ్వలాని ఏ స్త్రీ కోరుకోదు చెప్పండి. పిల్లల్ని కనాలని, తమ చేతులతో ఆడించాలని ఏ తల్లి కోరుకోదు చెప్పండి. ఎందరో స్త్రీలకు అమ్మ తనాన్ని దూరం చేస్తున్న ఈ సమస్య గురించి కాస్త లోతుగా చర్చించుకుందాం.

మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైంది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి ప‌డుకునే వ‌ర‌కు, ఇంకా చెబితే బెడ్ ప‌క్కనే ఎప్పటికీ అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి ప‌డుకోవ‌డం ఇప్పుడు అంద‌రికీ అల‌వాటైపోయింది. అలవాటు అనేకంటే వ్యసనంగా మారింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతుంద‌ని ఎప్పటి నుంచో వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే కొంద‌రు సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది ఏమిటంటే, రాత్రి పూట ఫోన్‌ను అతిగా (ఓవర్ నైట్ కూడా విడవకుండా) వాడ‌డం, లేదా ప‌క్కనే పెట్టుకుని నిద్రించ‌డం వంటి ప‌నులు చేస్తే అలాంటి వారికి సంతానం క‌లిగేందుకు చాలా త‌క్కువ‌గా అవ‌కాశం ఉంటుంద‌ని తెలిసింది.

ఇతర కారణాలు: మగవారిలో: పొగతాగడం, మద్యం సేవించడం.
గతుకుల రోడ్డు మీద వాహనాలను ఎక్కువగా నడపడం.
వృషణాలకు వేడి తీవ్రత ఎక్కువగా గురయ్యే పరిశ్రమల్లో పనిచేయడం.
వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా చికిత్స అయి ఉండడం.
గవద బిళ్లలు, సుఖరోగాల ఉండడం.

ఆడవారిలో: 18-36 వయస్సులో ఉన్న వారికి గర్భాన్ని దాల్చడానికి అనువైన వయస్సు. 18 లోపు & 34 దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ.
ఫెలోపియన్‌ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు
క్రమరహిత రుతుస్రావం
పెల్‌విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌
టి.బి (క్షయ) వంటి రోగాలు
పొగ తాగడం, మద్యం సేవించడం.
అండాశయ సమస్యలు.