నువ్వు దేవుడు సామి : అబ్బాయి పుట్టాలంటే భార్య భర్తలు ఏ టైంలో కలవాలో ఈయన చెప్తాడు  

Wife And Husband Met For Male Children Only On Even Days Says Sadhuvu - Telugu Even Days, Male Child Birth, Marriage, Relation, Saduvu, Viral News, Wife,

ప్రస్తుతం కంప్యూటర్‌ యుగం నడుస్తుంది.ఎంతో స్పీడ్‌గా మనుషులు దూసుకు పోతున్నారు.

Wife And Husband Met For Male Children Only On Even Days Says Sadhuvu - Telugu Child Birth Marriage Relation Saduvu Viral News

ఈ కాలంలో కూడా అబ్బాయిలు అమ్మాయిలు అంటూ కొందరు తేడాలు చేస్తూ చూస్తున్నారు అంటే వారు ఎంతగా వెనకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.అబ్బాయి వద్దు అబ్బాయి కావాలి అనుకునే వారు అందరి కంటే పాతిక ముప్పై ఏళ్లు వెనక పడ్డట్లుగా భావించవచ్చు.

అలాంటి వారు ఇప్పటికైనా మెలుకువలోకి వస్తే మంచిది.అబ్బాయిలు కావాలి, అమ్మాయిలు అయితే ఇబ్బంది అనుకునే వారు ఉన్నంత కాలం ఇండియా ఇలాగే ఉంటుంది.

తాజాగా ఒక సాధువు అబ్బాయి పుట్టాలంటే ఇలా చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

మహారాష్ట్రకు చెందిన ఇందురికర్‌ అనే సాధువు భార్య భర్తలు కలిసే సందర్బాన్ని బట్టి అమ్మాయి లేదా అబ్బాయి పుట్టడం ఆధారపడి ఉంటుందని అన్నాడు.

ఒక నెలలో డేట్‌ను మొత్తం చేయగా సరి సంఖ్య వచ్చేట్లు ఉంటే ఆ రోజున కలిస్తే అబ్బాయిలు పడుతారు.బేసి సంఖ్య డేట్‌లో కలిస్తే అమ్మాయి పుడతారు అంటూ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

మంచి రోజుల్లోనే కలవాలని, చవితి.అష్టమి.

గ్రహణం ఇలా చెడ్డ రోజులు దుర్ముర్తాల్లో కలిస్తే మాత్రం చాలా ప్రమాదమని.పుట్టే పిల్లలు నేరస్తులు అవుతారంటూ ఆయన హెచ్చరించాడు.

ఆయన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి.మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఇంకా ఇలాంటివి నమ్ముతున్నారు.అక్కడ ఈయన మాటలను చాలా పాటిస్తారు.దాంతో ఇప్పుడు అంతా కూడా అబ్బాయిల కోసం సరి సంఖ్య డేట్‌ ల కోసం ఎదురు చూస్తున్నారట.ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.నిజంగా అలా జరుగుతుందా అంటున్నారు.

ఆడ పిల్ల మగ పిల్లల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని జైలుకు పంపించాలంటూ కొందరు అంటున్నారు.అమ్మాయిలు అయితే పోయేది ఏముంది, అబ్బాయిలు అయితే వచ్చేది ఏముంది అంటున్నారు.నీలాంటి వారు సమాజంలో అబ్బాయిలు, అమ్మాయిలు సమానమని చెప్పాలి కాని ఇలాంటి ప్రచారాలు చేయవద్దంటూ ఆయనకు కొందరు బుద్ది చెబుతున్నారు.

తాజా వార్తలు