ఓటు విషయం లో భార్య,భర్తల మధ్య గొడవ....భార్య ప్రాణం తీసింది!  

Wife And Husband Argued About Voting...wife Dead-

భార్య,భర్త అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం.అసలు ఆ చిన్న చిన్న గొడవలు లేకపోతె వారినసలు భార్య,భర్త అని అనుకోరు.అయితే కొన్ని కొన్ని సార్లు హద్దు దాటి గొడవపడే భార్య,భర్తల విషయంలో కొన్ని దారుణాలు కూడా చోటుచేసుకుంటాయి..

Wife And Husband Argued About Voting...wife Dead--Wife And Husband Argued About Voting...wife Dead-

అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేయలేదని గొడవ పడిన ఒక భర్త భార్య ప్రాణాలు తీసే వరకు ఆ గొడవ దారి తీసింది.ఘజీపూర్ నియోజకవర్గం పరిధిలోని స్వవానియా గ్రామంలో ఈ దారుణం జరిగింది.

తన భార్య నీలంను బీఎస్పీకి ఓటు వేయాలంటూ ఆమె భర్త రాంబచ్ ఆదేశించగా, దానికి నీలం బీఎస్పీకి బదులుగా బీజేపీకి ఓటు వేసింది.ఓటు వేసిన అనంతరం తాను బీజేపీకి ఓటు వేశానని నీలం చెప్పడంతో రాంబచ్ ఆమెతో గొడవకు దిగాడు.ఆ గొడవ చిలికి చిలికి గాలివాన లా మారడం తో రాంబచ్ ఆవేశంతో తన భార్యను కర్రతో కొట్టాడు.

దీనితో నీలం కు బలంగా కర్ర తగలడం తో ఆమె ఉన్నట్టుండి అక్కడే కుప్పకూలిపోయింది.ఈ లోపు ఆమె అరుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్లు అక్కడికి రావడంతో రాంబచ్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది.అయితే ఇది ఓటు విషయంలో గొడవ కాదని అదనపు కట్నం కోసమే నీలం పై కర్ర తో రాంబచ్ దాడి చేసినట్లు నీలం తరపు బంధువులు చెబుతున్నారు.

దీనితో పోలీసులకు ఆమె బంధువులు ఫిర్యాదు చేయడం తో రాంబచ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.