పెళ్లి సినిమాని నిజజీవితంలో చూపించిన అత్త! అత్త అమ్మగా మారింది  

కోడలికి మళ్ళీ పెళ్లి చేసిన అత్త. .

Widow Daughter In Law Aunt Again Marriage-indian Marriage Law,widow Daughter In Law Aunt

పదేళ్ళ క్రితం తెలుగులో వడ్డే నవీన్ హీరోగా, మల్లీశ్వరి హీరోయిన్ పెళ్లి అనే సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమాలాంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది..

పెళ్లి సినిమాని నిజజీవితంలో చూపించిన అత్త! అత్త అమ్మగా మారింది-Widow Daughter In Law Aunt Again Marriage

అత్తే తల్లిగా మారి తన కోడలికి పెళ్లి చేసింది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే హీరా పూర్ లో నివసించే జ్ఞానేశ్వరి కుమారుడు డోమేంద్రకు సాహుకు రెండేళ్ల క్రితం పెళ్లి చేసింది.

కొంతకాలానికే డోమేంద్ర సాహి అసస్వాత్తుగా చనిపోయాడు. అప్పటికే కోడలు గర్భవతి అయ్యింది. తరువాత ఆమెకు అబార్షన్ అయ్యింది.

అయితే కోడలు కళ్ళముందు అలా విధవగా తిరుగుతూ ఉండటం చూడలేకపోయిన ఆమెకు కోడల్లికి మరో వివాహం చేయాలని నిశ్చయించుకుంది. ఎన్నో సంబంధాలు చూసి చివరికి కోడలికి వివాహం చేసింది. తాను తన కోడలిని కూతురుగానే భావించానని కుమారుడు చనిపోయినప్పటికీ ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నానని తన భర్త 15 ఏళ్ల క్రితం చనిపోయాడనీ తనలా తన కోడలు కష్టాలు పడకూడదని మరో పెళ్లి చేసానని తెలిపింది జ్ఞానేశ్వరి అనే మహిళా చెప్పుకొచ్చింది. పెద్ద మనస్సుతో చేసిన ఈ అరుదైన వివాహానికి బంధువులంతా హాజరయ్యారు.

జ్ఞానేశ్వరిని అభినందించారు.