జగన్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు వణుకు ఎందుకు ? అసంతృప్తికి కారణం ?

ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించక ముందు నుంచి జగన్ వ్యవహారశైలిపై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూనే ఉండేది.జగన్ ఎవరి మాట వినే రకం కాదని, జగన్ తాను చెప్పిందే తప్ప ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోరని ప్రచారం జరిగింది.

 Why Ysrcp Mla's Fears With Cm Ys Jagan , Tdp Leaders, Local Body Elections-TeluguStop.com

ఆ విధంగానే జగన్ వ్యవహరిస్తూ వచ్చేవారు.అయితే ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టడం, ఆ తరువాత ఎన్నికల్లో 151 సీట్లతో జగన్ తన బలం ఏంటో నిరూపించుకున్నారు.

దీంతో జగన్ నిర్ణయాలు ,ఆలోచనలు ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేసుకుంటూ వస్తున్నారు.పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జగన్ నిర్ణయమే ఫైనల్ అన్ననట్డుగా వ్యవహారం నడుస్తోంది.

ఎమ్మెల్యేలు, మంత్రులు గా ఉన్న వారి ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, ప్రతి నిర్ణయం జగన్ మాత్రమే తీసుకుంటున్నారు.

ఎమ్మెల్యేలు మంత్రుల పాత్ర పెద్దగా లేకుండానే అధికారులతో పరిపాలన సాగిస్తున్నారు జగన్ .అయితే ఇప్పుడు జగన్ వ్యవహార శైలిపై పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే జగన్ తీసుకున్న నిర్ణయాలతో వైసీపీ ఎమ్మెల్యే లు భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.ప్రత్యక్షంగా కాకపోయినా లోలోపల జగన్ నిర్ణయాలను తప్పు పడుతూ తన అనుచరుల వద్ద బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పది నెలల క్రితం జరిగిన ఏపీ ఎన్నికల్లో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు.దీంతో వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు రాలేదు.

ఇక జగన్ కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలను తాము చేర్చుకోము అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.కానీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపించింది.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకునేందుకు జగన్ నిర్ణయించుకుని చేరికల ను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.దీంతో వైసీపీలో టిడిపి నాయకుల వలసలు బాగా పెరిగిపోయాయి.

టిడిపి, జనసేన పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నట్టు గా కనిపిస్తున్నా, ముందు ముందు నాయకులు గ్రూపు తగాదాలు పెరిగే అవకాశం ఉంది.

మొన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్నవారు మళ్లీ ఇప్పుడు నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తారనే భయం వైసిపి నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఎన్నికల ముందు తరువాత పార్టీలో ఇతర పార్టీల నాయకులను చేర్చుకోను అని చెప్పి ఇప్పుడు జగన్ ఈ విధంగా చేయడంపై వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube