గాలి తీస్తున్నారే : మీడియా తో సున్నం అవసరమా ...?

రాజకీయ పార్టీలు మీడియా ని నమ్ముకునే వ్యవహారాలు చేస్తూ ఉంటాయి.తాము క్షేత్రస్థాయిలో ఎంత కష్టపడినా… మీడియాలో ఫోకస్ అవ్వకపోతే అది ఉపయోగం లేనట్టేనని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి.

 Why Ys Jagan Silent About Media-TeluguStop.com

అందుకే చిన్న పనైనా .పెద్ద పనైనా మీడియా ముఖంగా చేయడం , ఆ మీడియా ద్వారా ప్రజల్లోకి తాము ఏం చేస్తున్నాము ఎంత కష్ట పడుతున్నాము అనే విషయం తెలియజేయాలని పార్టీలు భావిస్తున్నాయి.మీడియా సపోర్ట్ లేకపోతే ప్రస్తుత రాజకీయాల్లో మనుగడ సాగించలేని పరిస్థితి.ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే మీడియాలో ప్రస్తుతం కొన్ని చానల్స్ కొన్ని కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి ప్రయోజనాలు వారివి.

రాజకీయ పార్టీల అవసరం మీడియా కు ఎంత ఉందో … మీడియా అవసరం కూడా రాజకీయ పార్టీలకు అంతే ఉంది.అందుకే పరస్పరం ఈ రెండు ఒకరికొకరు సహకరించుకుంటూ… ముందుకు వెళ్తుంటాయి.అయితే ఇందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ వ్యవహారం కనిపిస్తోంది.ఎన్నికల సమయంలో మీడియా ను మచ్చిక చేసుకుని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాల్సిన జగన్ అందుకు భిన్నంగా… మీడియా కు కుల ముద్ర వేసి … బహిరంగ సభల్లో ఆయా మీడియా సంస్థల పేర్లు చెప్పి మరీ వాటిని నమ్మొద్దని చెప్పడం ఖచ్చితంగా అవివేకంగానే కనిపిస్తోంది.

దీనివలన అనుకూల ఫలితాలు వచ్చే సంగతి ఎలా ఉన్నా… ప్రజల్లో , ఆయా మీడియా సంస్థల దృష్టిలో పలుచనవ్వడం మాత్రం ఖాయం.

ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉండటంతో …అన్ని మీడియా సంస్థల యాజమాన్యాలతో ఒకసారి కూర్చుని మాట్లాడాలని జగన్ మీద పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారట.అయితే జగన్ మాత్రం ఆ విషయంలో తన ఇగోను పక్కనపెట్టలేకపోతున్నట్టు తెలుస్తోంది.ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ విషయం తీవ్రం అవుతుందని వైసీపీ నాయకులు బయపడుతుంటే … జగన్ మాత్రం కూల్ గా ఉంటున్నాడు.

మనం కలిసి పని చేద్దాం అని మీడియా యాజమాన్యాలతో ఒక్కమాట చెప్పండి చాలు మిగతా సంగతి మేము చూసుకుంటాం అని నాయకులు జగన్ ని వేడుకుంటున్న… ఆయన మాత్రం ఒక మెట్టు దిగేందుకు ససేమీరా అంటున్నాడని పార్టీలో కొంతమంది కీలక నాయకులు చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube