మంత్రులు మాట వినడంలేదా ? 'జగన్ నిఘా' ఎందుకు పెట్టారు ?  

Why Ys Jagan Puts Concentration On Jagan Cabinet-

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు అధికారపక్షం ఇలా ఎత్తులు, పై ఎత్తులతో బిజీగా ఉన్నారు.అసెంబ్లీ విరామం సమయంలో జగన్ కొంతమంది మంత్రులను పిలిపించుకుని గట్టిగా క్లాస్ పీకుతున్నారని తెలుస్తోంది.

Why Ys Jagan Puts Concentration On Jagan Cabinet--Why YS Jagan Puts Concentration On Cabinet-

ఏ మంత్రి ఏం చాదస్తున్నాడు.వారిని ఎవరెవరు కలుస్తున్నారు ? ఎందుకు కలుస్తున్నారు ? అవినీతి వ్యవహారాల్లో ఏమైనా తలదూరుస్తున్నారా ఇలా అనేక విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ దాని ఆధారంగా మంత్రుల్లో కొంతమందిని పిలిచి వార్నింగ్ ఇస్తున్నాడట.మన ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఏ ఒక్క మంత్రి కూడా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి పదే పదే హెచ్చరికలు చేస్తున్నా మంత్రులు కొంతమంది చెవికెక్కించుకోకపోవడం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోందట.

Why Ys Jagan Puts Concentration On Jagan Cabinet--Why YS Jagan Puts Concentration On Cabinet-

జగన్ ప్రస్తుతానికి ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తూ పరిపాలన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.నరేంద్రమోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అనేకమంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.వారిలో కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమాచారం రప్పించుకుని వారికి తగిన సలహాలు, సూచనలు, హెచ్చరికలు చేస్తూ ఉండేవారు.

ఆయా మంత్రుల కదలికలపై నిఘా పెట్టడమే కాకుండా ,బంధువులు, స్నేహితులను రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చకుండా దూరం పెట్టాలని సూచించారు.ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములాను జగన్ తన మంత్రివర్గం మీద ప్రయోగిస్తున్నాడు

మంత్రులు ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలొస్తే సహించేది లేదనీ, పదవులు గ్యారంటీ అనుకోవద్దనీ, విచారణలో తప్పులు జరిగినట్టు తేలితే నిర్ధాక్షిణ్యంగా బయటకు సాగనంపుతాననీ” జగన్ గట్టిగానే హెచ్చరిస్తున్నాడు.అయినా కొంతమంది మాత్రం అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.ఇప్పుడు జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో 95 శాతం మందికి రెండున్నరేళ్లే పదవీకాలం ఉంటుంది.ఆ తరువాత ఆ స్థానాల్లోకి కొత్తవారు వస్తారు అని జగన్ ఇప్పటికే ప్రకటించారు.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొందరు మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట.తాము రెండున్నరేళ్లు మాత్రమే పదవిలో ఉంటాము కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో కొంతమంది మంత్రులు ఉన్నారు.