వేరుశనగలు తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుందో తెలుసా... తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం

మన రోజు వారి తినే ఆహార పదార్థాల్లో వేరుశనగలు తప్పకుండా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాం.కొందరు ప్రత్యేకంగా వేరుశనగలను తింటూ ఉంటారు.

 Why You Should Not Drink Water After Eating Peanuts-TeluguStop.com

వేయించినవి లేదంటే పచ్చివి అలా కాదంటే ఉడకబెట్టినవి.ఇలా ఏదో ఒక రకంగా వేరుశనగలను తింటూనే ఉంటారు.

వేరుశనగలను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే.అయితే వాటిని తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల మాత్రం దుష్పరిణామాలు ఎదురవుతాయి అనేది వైధ్యుల సూచన.

 Why You Should Not Drink Water After Eating Peanuts-వేరుశనగలు తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుందో తెలుసా… తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వేరుశనగలు తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వేరు శనగలు అంటేనే నూనే పదార్థం.

అలాంటి నూనే పదార్థం అయిన వేను శనగను తిన్న వెంటనే నీరు తాగడం వల్ల వేరుశనగల్లోని ఆయిల్‌ ఆహార నాళంకు పట్టి ఉంటుంది.అలా పట్టి ఉండటంతో అది కాస్త కొవ్వుగా పేరుకు పోయి ఆహారనాళంపై ప్రభావం చూపుతుంది.

పల్లీలు తినడం వల్ల ఒంటో వేడి పుడుతుంది.అతిగా పల్లీలు తింటే వేడి చేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు.

అలాంటి వేడి పదార్థాలు అయిన పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగితే జీర్ణక్రియలో తేడా కొడుతుంది.ఆ తర్వాత జలుబు మరియు దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.

పల్లీల్లో ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది.అయితే తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్య అవుతుంది.అందుకే తినగానే నీటిని తాగకూడదు.

పల్లీల్లో ఉండే పోషకాలు శరీరం వినియోగించుకునేందుకు తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలైనా నీళ్లు తాగకుండా వెయిట్‌ చేస్తే బాగుంటుంది.

పల్లీలు తిన్నగానే నీళ్లు తాగడం వల్ల నోరు దుర్వాసన కూడా ఉంటుంది.

అందుకే పళ్లీలు తిన్న కనీసం పావు గంట తర్వాత నీరు తాగితే మంచిది.

#Fat #Oil #Water Peanuts #Water #Peanuts

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు