ఎంత చేసినా ఇంతేనా ? వైసీపీలో జోష్ ఎందుకు లేదు ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిఆరు నెలలు పూర్తి కావస్తోంది.ఈ సమయంలో అన్ని వర్గాల ప్రజలను పార్టీలకు అతీతంగా దగ్గర చేసుకునేందుకు జగన్ తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు.

 Why Ycp Leaders Silent In Ap Capitals-TeluguStop.com

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ముఖాల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించారు.ఈ సమయంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.

తాను తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదమైన, కేంద్రం నుంచి బెదిరింపులు వచ్చినా, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినా జగన్ ఎక్కడా వెనకడుగు వేయలేదు.తాను చేయాల్సిన పని చేసుకుంటూనే ముందుకు వెళ్ళాడు.

వెళ్తూనే ఉన్నాడు.రాజధాని విషయంలోనూ అదే స్పీడ్ తో ముందుకు వెళ్తున్నాడు.

Telugu Ap Amaravathi, Ap Kurnool, Apcm, Kurnool, Tdp Ap, Vizag Mp Ap, Ycp Ap, Yc

ఏపీకి అత్యంత కీలకమైన రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి తీరుతానని జగన్ గట్టిగానే చెబుతున్నాడు.ఏపీకి రాజధాని గా అమరావతిని దాదాపు అందరూ అంగీకరించినా మొదటి నుంచి అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టు గా కనిపించిన జగన్ అక్కడ లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేపట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి వచ్చేసాడు.అందుకే మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు.నిర్ణయం తీసుకోవడమే కాకుండా, విశాఖలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 1250 కోట్లను కేటాయించారు.

దీనికి సంబంధించి ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన శనివారం వెళ్లి చేసి వచ్చారు.దీంతో రాజధాని విశాఖ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

Telugu Ap Amaravathi, Ap Kurnool, Apcm, Kurnool, Tdp Ap, Vizag Mp Ap, Ycp Ap, Yc

జగన్ నిర్ణయం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసిపి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.కానీ వైసిపి నాయకుల్లో మాత్రం ఆ ఆనందం పెద్దగా కనిపించడం లేదు.విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు జగన్ వెళ్లినా టిడిపి నాయకులు నిరసనలు తెలపలేదు.అంటే జగన్ నిర్ణయాన్ని వారు సమర్పించారని చెప్పుకోవాలి.కానీ ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు ఎక్కడా హడావుడి చేయకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు.విశాఖ ఎంపీ వైసీపీ నాయకుడే అయినా ఇప్పటి వరకు ఆయన మీడియా ముందుకు వచ్చి విశాఖను రాజధానిగా ప్రకటించిన విషయంపై స్పందించలేదు.

ఆయనే కాదు మిగతా వైసీపీ కీలక నాయకులు ఎవరు కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి హడావుడి చేసేందుకు ఉత్సాహం చూపించడం లేదు.దీంతో అసలు విశాఖ వైసీపీ నాయకులకు ఏమైందో వాళ్లు ఎందుకు అలా నిరుత్సాహంతో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్థితి విశాఖ వైసీపీలో నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube