దహన సంస్కరణ కార్యక్రమాలకు మహిళలు ఎందుకు దూరంగా ఉంటారు?  

reason behind why woman not allowed for death cremetion, death rights, women, Hindu rituals, Hindu believes, Hindu funeral - Telugu Death Rights, Hindu Believes, Hindu Funeral, Hindu Rituals, Reason Behind Why Woman Not Allowed For Death Cremetion, Women

సాధారణంగా ఒక మనిషి ఈ భూమిపై పుట్టినప్పుడు అందరూ కలిసి ఎంతో ఘనంగా బారసాల కార్యక్రమాన్ని, అన్నప్రాసన కార్యక్రమం, నామకరణం, పెళ్లి ,శ్రీమంతం వంటి కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేస్తారు.అలాగే ఆ వ్యక్తి మరణించినప్పుడు కూడా ఈ భూమి నుంచి ఇతర లోకానికి ఆత్మ వెళ్లాలని అతని పార్థివదేహాన్ని ప్రార్థిస్తూ దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

TeluguStop.com - Why Women Not Allowed Death Cremetion Reason

అయితే ఈ దహన సంస్కరణ కార్యక్రమాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్వహిస్తుంటారు.అయితే దహన సంస్కరణ కార్యక్రమాలలో హిందూ ఆచారం ప్రకారం మహిళలు స్మశానవాటికలో దహన సంస్కరణ కార్యక్రమంలో పాల్గొనరు.

అయితే ఎందుకు పాల్గొనరో ఇక్కడ తెలుసుకుందాం…

TeluguStop.com - దహన సంస్కరణ కార్యక్రమాలకు మహిళలు ఎందుకు దూరంగా ఉంటారు-Devotional-Telugu Tollywood Photo Image

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొంతమంది పార్థివదేహాన్ని ఒక గోతిలో పాతి పెడుతుంటారు.మరికొంతమంది దహనం చేస్తుంటారు.

కానీ మహిళలను మాత్రం స్మశాన వాటికకు రానివ్వకపోవడానికి కారణం ఏమిటంటే… పురుషులతో పోలిస్తే మహిళలు తొందరగా భావోద్వేగానికి గురి అవుతారు.అందువల్ల దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వారు భావోద్వేగానికి లోనయి మానసికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

అందుకోసమే మహిళలను దహన సంస్కరణ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు.

పూర్వకాలంలో దహన సంస్కరణ కార్యక్రమాలకు మహిళలు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న ముసలి వారిని, చిన్నపిల్లలను చూసుకుంటూ, దహన సంస్కరణలు ముగించుకుని వచ్చే సమయానికి ఇంటిని శుభ్రం చేసి వారికి భోజనం చేయాలి కాబట్టి మహిళలను స్మశాన వాటికకు దూరంగా ఉంచేవారు.అంతేకాకుండా స్మశానవాటికలు కొన్ని దుష్టశక్తులు ఉంటాయని నమ్ముతుంటారు.మహిళల జుట్టు అధికంగా ఉండటం వల్ల దుష్టశక్తులు వారిని ఆవహించే ప్రమాదముందని వారిని ఆ కార్యక్రమానికి దూరంగా ఉంచుతారు.

అలాగే గర్భం ధరించిన స్త్రీలను కూడా స్మశాన వాటికలోకి రానివ్వరు.ఇందు వల్ల మహిళలను హిందూ సాంప్రదాయాల ప్రకారం దహన సంస్కరణ కార్యక్రమాలకు దూరంగా ఉంచడానికి కారణాలుగా చెబుతుంటారు.

#Hindu Believes #Death Rights #Hindu Funeral #ReasonBehind #Hindu Rituals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL