అర్జునా-ఫాల్గుణా అంటే ఏమిటి? పిడుగు పడితే ఎందుకు జపించాలి?  

Why We Should Chant “arjuna – Phalguna” During Thunders-

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది ‌.తెలుగు రాష్ట్రాల నలుమూలలా భారీ వర్షాలు పడుతున్నాయి.ఇక హైదరాబాద్ లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.పిడుగులు పడి చనిపోయిన వారి గురించి కూడా మనం పేపర్ లో చదువుకుంటున్నాం.

పిడుగు శబ్దం మనుషులని భయభ్రాంతులకు గురి చేస్తుంది.ఇలాంటి సమయంలో అర్జునా ఫాల్గుణా అంటూ అర్జునుడి నామాలను జపించాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

Why We Should Chant “arjuna – Phalguna” During Thunders- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why We Should Chant “arjuna – Phalguna” During Thunders---

అసలు ఫాల్గుణ అనే నామానికి అర్థం ఏమిటి? పిడుగులు పడుతున్నప్పుడు ఎందుకు జపించాలి? మీకు జవాబు చెప్పే ముందు వచ్చిన కథ చెప్పాలి.

పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో విరాట మహారాజు కొలువులో పలురకాల వృత్తిలో ఉంటూ అక్కడే బస చేశారని మీకు తెలిసినదే.

అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు.పాండవులు ఎక్కడ ఉన్నది తెలుసుకున్న కౌరవులు వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేసేందుకు విరాటరాజు రాజ్యంపై దాడికి దిగుతారు.

అప్పుడు అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరకుమారుడి రథానికి రథసారధిగా వ్యవహరిస్తాడు.అయితే కౌరవులు లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు.

రాజకుమారుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.అయితే భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు.

నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు.

అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలు ఉంటాయి.

ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు.గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని, ఎంతటి వీరుడి నైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని, దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరిటి అంటారని, కుంతీ దేవి అసలు పేరు పృథ, ఆమెకు జన్మించడం వలన పార్ధ అంటారని, ఇక ఉత్తర ఫల్గునీ నక్షత్రం మరియు పూర్వ పాల్గొని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడిని నమ్మిస్తాడు.

ఫాల్గుణ నామం వెనుక ఉన్న అర్థం ఇదేనండి.ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే పిడుగులు పడటం అగుతుందని, అలాగే ధైర్యం వస్తుందని పెద్దలు చెబుతారు.

.

Why We Should Chant “arjuna – Phalguna” During Thunders- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why We Should Chant “arjuna – Phalguna” During Thunders-- Telugu Related Details Posts....

DEVOTIONAL