నందీశ్వరుని కొమ్ముల మధ్యలోనుండి శివుణ్ణి దర్శించుకుంటారు...ఎందుకు?

శివాలయంలో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన కొమ్ములలో నుండీ శివలింగాన్ని దర్శించుకోవడం అనేది అనాది నుంచీ వస్తున్న ఆచారం.అయితే దీనికి కారణం ఏమిటో చాలమందికి తెలియదు.

 Why We See Lord Shiva From Bull Horns Why Do We See Lordshiva,  Lordshiva, Nande-TeluguStop.com

నందీశ్వరుడు మహాదేవుని పరమ భక్తుడని, వాహనమనీ మనందరికీ తెలుసున్న విషయమే.ఆ శంకరుని కృపాకటాక్షాలు మనపై ఉండాలి అంటే ముందుగా నందీశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించటం ముఖ్యం.

మరి దానికీ నందీశ్వరుని కొమ్ముల లోనుండీ శివలింగాన్ని దర్శించుకోవడానికీ గల సంబంధం ఏమిటి.

నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక.

నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికీ రెండోవది సుదర్శనానికి చిహ్నాలని వేదాలు చెపుతున్నాయి.లింగ రూపం లో ఉన్న పరమేశ్వరుని దర్శించాలంటే నందీశ్వరుని ముందు పువ్వులనుంచి, పృష్ఠ భాగాన్ని కుడిచేతితో తాకుతూ, ఎడమచేతి వేళ్ళను ఆయన కొమ్ముల పై ఉంచి, మూపురం పైన తల ఉంచి.

నందీశ్వరుని కొమ్ములకూ చేతి వేళ్ళకూ మధ్యనుండీ ఏకాగ్ర దృష్టితో శివుని దర్శించాలి.అప్పుడే మనం అనుకున్న కోరికలు నెరవేరతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube